Jagan Sattenapalli Visit: మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy) ఏపీ పోలీసులు షాక్ ఇచ్చారు. ఊహించని ట్విస్ట్ ఇవ్వడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మైండ్ బ్లాక్ అయింది. జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటనకు ఏపీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈనెల 18న సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ విగ్రహ ఆవిష్కరణకు గాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు జిల్లా పోలీసుల అనుమతి కోరారు. కానీ పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు షాక్ తగిలినట్లు అయింది.
అనుమతి నిరాకరణ..
ఇటీవల జగన్మోహన్ రెడ్డి పర్యటనల సమయంలో తలెత్తుతున్న శాంతిభద్రతల విఘాతం దృష్ట్యా అనుమతి నిరాకరిస్తున్నట్లు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు( Kanchi Srinivasa Rao ) చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు. అయితే విగ్రహ ఆవిష్కరణకు పరిమిత సంఖ్యలో మాత్రమే జనాలు రావాలని కూడా సూచించారు. లేకుంటే చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పర్యటనల సమయంలో చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అనంతపురం జిల్లాలో పర్యటన సమయంలో ఒకేసారి జనాలు హెలిప్యాడ్ వద్దకు దూసుకొచ్చారు. ఇటీవల ఓ జిల్లా పర్యటనకు వెళ్తే విధ్వంసం పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలోనే పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: YS Jagan Mohan Reddy : జగన్మోహన్ రెడ్డి అరెస్ట్.. ముహూర్తం ఫిక్స్!
పరిమిత సంఖ్యలో వస్తేనే.. సత్తెనపల్లి( sattenapalle ) మండలం రెంటపాళ్లలో విగ్రహ ఆవిష్కరణకు జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. అందుకు సంబంధించి జగన్ పర్యటన కోసం సత్తెనపల్లి వైసీపీ ఇన్చార్జ్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఈ కార్యక్రమానికి ఎంత మంది వస్తున్నారు? ఎన్ని వాహనాలు వస్తున్నాయి? వారికి కావాల్సిన ఏర్పాట్లు ఏమిటి అనే పూర్తి వివరాలను సమర్పించకపోయేసరికి పల్నాడు జిల్లా ఎస్పీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 30 వేల మందికి పైగా జనాలు వచ్చే అవకాశం ఉందని తెలియడంతో పోలీసులు అనుమతి నిరాకరించినట్లు సమాచారం.
Also Read: AP Liquor Scandal: ఏపీ మద్యం కుంభకోణం.. నోరు విప్పిన జగన్!
ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఈ నిర్ణయానికి వచ్చారు. అయితే పోలీసులు అడిగిన పత్రాలు, వివరాలు అందిస్తే మాత్రం వారు పునః పరిశీలించే అవకాశం ఉంది. మరోవైపు పలనాడు జిల్లా ఎస్పీ మాత్రం వైయస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం కలిగించడం లేదని.. సెక్యూరిటీ కాన్వాయ్ తో పాటు మరో మూడు వాహనాలు, 100 మంది వరకు విగ్రహ ఆవిష్కరణకు వస్తే తమకు అభ్యంతరం లేదని చెబుతున్నారు. వైసీపీ నేతల కోరిన విధంగా అనుమతి ఇవ్వలేమని తేల్చి చెబుతున్నారు. మొత్తానికి అయితే ఏపీ పోలీసులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చినట్లు అయింది.