Hari Hara Veeramallu
Hari Hara Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu Movie) చిత్రం అనేక పర్వాలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు మే 9న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అధికారిక ప్రకటన నేడు కాసేపటి క్రితమే చేసారు. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన ఒక పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ నుండి మే 9న విడుదల చేసుకోవచ్చని అనుమతి లభించిందట. ఇక మేకర్స్ అప్పటికప్పుడు మాట్లాడుకొని ఉదయం 6 గంటల 30 నిమిషాలకు పోస్టర్ ని విడుదల చేసారు. అంత ఉదయం అప్డేట్ ఇవ్వడం ఏమిటి అని అభిమానులు సోషల్ మీడియా లో విరుచుకుపడ్డారు. నేడు శుభ దినం, శుభ ముహూర్తం కారణంగానే ఆ సమయంలో విడుదల చేసినట్టు చెప్పుకొస్తున్నారు.
Also Read : ‘హరి హర వీరమల్లు’ నుండి ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ లీక్..ఏ రేంజ్ ఉందంటే!
ఇదంతా పక్కన పెడితే ఈరోజు విడుదల చేసిన పోస్టర్ కి ఫ్యాన్స్ నుండి చాలా నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఫ్యాన్ మేడ్ ఎడిట్స్ కూడా ఇంతకంటే బాగుంటాయి. ఇదేమి నాసిరకం క్వాలిటీ అంటూ అభిమానులు మేకర్స్ పై విరుచుకుపడ్డారు. సినిమా మీద ఇప్పటికే ఉన్నటువంటి ఆశలు, అంచనాలు రిపీట్ గా వాయిదాలు వేయడం వల్ల అభిమానుల్లో పోయింది. రీసెంట్ గా విడుదల చేసిన ‘కొల్లగొట్టినాదిరో’ పాట సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడిప్పుడే అభిమానుల్లో ఆశలు పెరుగుతున్న సమయం లో ఇలాంటి చీప్ క్వాలిటీ పోస్టర్స్ వదులుతారా?, మీ లాంటి చెత్త నిర్మాతలను ఇప్పటి వరకు చూడలేదంటూ బహిరంగంగానే మేకర్స్ ని ఫ్యాన్స్ తిడుతున్నారు. అప్పటికప్పుడు అనుకొని చేసిన పోస్టర్ కాబట్టి అలాంటి క్వాలిటీ ఉందని, రాబోయే రోజుల్లో కంటెంట్ ఇలా ఉండదని సినిమాకు సంబంధించిన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ గా నిధి అగర్వాల్(Nidhi agarwal) నటించగా, సునీల్, సుబ్బరాజ్, నాజర్, బాబీ డియోల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, ఆస్కార్ అవార్డు గ్రహీత MM కీరవాణి(MM Keeravani) సంగీతం అందిస్తున్నాడు.
రీసెంట్ గానే ముంబై లో బాబీ డియోల్(Bobby Deol) మీద చివరి షెడ్యూల్ ని పూర్తి చేసారు. ఇక పవన్ కళ్యాణ్ కి సంబంధించి వారం రోజుల కాల్ షీట్స్ అవసరం ఉంది. ఈ నెల 20 వ తేదీ తర్వాత ఆయన డేట్స్ ఇస్తాడని తెలుస్తుంది. అందుకే విడుదల తేదీని ఖరారు చేసినట్టు సమాచారం. వచ్చే నెల 9 లేదా 10 వ తేదీ నుండి ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టబోతున్నారు. సుమారుగా 7 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్నడైరెక్ట్ చిత్రమిది. ఆయనకు సంబంధించి మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా కూడా ఇదే. ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి. అయితే ఇన్ని సార్లు డేట్స్ మార్చారు, కనీసం ఈసారైనా చెప్పిన మాట మీద నిలబడుతారా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
Also Read : ‘హరి హర వీరమల్లు’ చిత్రం సూపర్ హిట్ అవ్వాలంటే ఇన్ని వందల కోట్లు రాబట్టాలా..? సాధ్యం అయ్యే పనేనా!