Hari Hara Veeramallu : ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంత గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి… తన స్టైల్ తో తన మేనరిజం తో ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకోవడమే కాకుండా, తన వ్యక్తిత్వం ద్వారా కూడా చాలామందిని తన అభిమానులుగా మార్చుకున్నాడు.
Also Read : ‘పుష్ప 2’ మేకర్స్ చేతుల్లోకి ‘హరి హర వీరమల్లు’..ఇక ఫ్యాన్స్ కి ప్రతిరోజు పండగే!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan)కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. అందుకే ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలామంది నటులకు తను పోటీని ఇస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ప్రస్తుతం ఏపి డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నప్పటికీ సినిమాలు చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇప్పటికే ఆయన ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu) సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న క్రమంలో ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ని రిలీజ్ చేయాలని మేకర్స్ అయితే భావిస్తున్నారు. మొదట ఈ సినిమాని మే 30 వ తేదీన రిలీజ్ చేస్తామంటూ అనౌన్స్ చేసినప్పటికి ఇప్పుడు జూన్ 13వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అంటూ రీసెంట్ గా ఒక అఫీషియల్ పోస్టర్ ను అయితే రిలీజ్ చేశారు.
ట్రైలర్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దాని మీద ఒక సరైన క్లారిటీ ఇవ్వనప్పటికి ఒక వారం రోజుల్లో ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇప్పటికే దర్శకుడు ‘జ్యోతి కృష్ణ’ (Jyothi Krishna) రెడీ చేయించిన ట్రైలర్ పవన్ కళ్యాణ్ కి అంత పెద్దగా నచ్చలేదట. దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ మరికొన్ని చేంజెస్ చెప్పి ఆ ట్రైలర్ కట్ ని చేయిస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే మాత్రం ఆయన మార్కెట్ మరింత డౌన్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు బ్రో (Bro) సినిమా ఆశించిన మేరకు విజయాన్ని అయితే సాధించలేదు.
కాబట్టి ఇప్పుడు ఈ సినిమాతో ఆయన మంచి విజయాన్ని సాధించి తన తదుపరి సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరమైతే ఉంది…చూడాలి మరి ఈ సినిమా సూపర్ హిట్ అయి పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఒక మైలురాయి గా నిలుస్తుందా లేదా అనేది.
Also Read : సోమవారం రోజున ‘హరి హర వీరమల్లు’ నిర్మాత సంచలన ప్రెస్ మీట్..విషయం ఏమిటంటే!