Hari Hara Veeramallu : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu Movie) చిత్రం షూటింగ్ కార్యక్రమాలను మొత్తం ఇటీవలే పూర్తి చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే నెల 12న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. అధికారిక ప్రకటన ఇంకా బయటకు రాలేదు కానీ, సోమవారం రోజున, అనగా మే 19న అధికారిక ప్రకటన చేయబోతున్నారట. దీనిపై సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఫైర్ మీద ఉన్నారు. ఎందుకంటే వీకెండ్ లో అప్డేట్ ఇస్తే అందరికీ బాగా చేరువ అవుతుంది కానీ, పనిదినమైన సోమవారం రోజున ఇస్తే రావాల్సిన రీచ్ రాదు అని అభిమానుల ఆవేదన. పైగా విడుదలకు సరిగ్గా 22 రోజుల ముందు ప్రకటన అంటే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చే వారం లోనే మొదలు అవ్వాలి.
Also Read : అభిమానులను పిచ్చెక్కిస్తున్న ‘హరి హర వీరమల్లు’ టీం మౌనం..అసలు ఏమి జరుగుతుంది?
కానీ ఓవర్సీస్ లో ఇప్పటి వరకు బయ్యర్స్ ని తో డీలింగ్స్ కూడా ఏర్పాటు చేసుకోలేదు నిర్మాత AM రత్నం. ఆయనపై ఈ విషయం లో ఫ్యాన్స్ పట్టరాని కోపం తో రగిలిపోతున్నారు. ఇదంతా పక్కన పెడితే నైజాం ప్రాంతం హక్కులను మైత్రీ మూవీ మేకర్స్(పుష్ప 2 నిర్మాణ సంస్థ) కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. సుమారుగా 55 కోట్ల రూపాయలకు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని అమ్మారట. 55 కోట్ల రూపాయిల థియేట్రికల్ రైట్స్ రీ కవర్ అవ్వాలంటే కచ్చితంగా టికెట్ రేట్స్, అదనపు బెనిఫిట్ షోస్ ఉండాల్సిందే. కానీ ‘పుష్ప 2’ ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం హైక్స్, అదనపు షోస్ ఇస్తుందో లేదో అని ఫ్యాన్స్ భయపడుతున్నారు. పైగా దిల్ రాజు తో పోలిస్తే మైత్రీ మూవీ మేకర్స్ నైజాం ప్రాంతం లో వీక్ అనే చెప్పాలి.
భారీ రిలీజ్ వీళ్ళు ఇవ్వలేరు అనే భావన అందరిలోనూ ఉన్నది. ఎందుకంటే ‘పుష్ప 2’ చిత్రం విడుదల సమయంలో పంతానికి వెళ్లి కొన్ని టాప్ థియేటర్స్ లో విడుదల కూడా చెయ్యలేదు. ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఈ సినిమా విడుదల కాలేదు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషించిన గత చిత్రం ‘బ్రో ది అవతార్’ కి చాలా చీప్ రిలీజ్ ఇచ్చారు. దాని వల్ల భారీ వసూళ్లను రాబట్టాల్సిన ఈ చిత్రం కేవలం యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ‘హరి హర వీరమల్లు’ కి ఎలాంటి రిలీజ్ ఇస్తాడో అనే భయం అందరిలో ఉన్నది. కానీ మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించిన యుఫొరియా ని ఎంజాయ్ చేయడం పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంతృప్తి తో ఉన్నారు. చూడాలి మరి కామెరిసిల్ గా ఈ చిత్రం ఎంతమేరకు సక్సెస్ అవుతుంది అనేది.
Also Read : హరి హర వీరమల్లు’ కి హాలీవుడ్ హీరో ‘టామ్ క్రూజ్’ గండం..ఇలా అయితే కష్టమే!