Hari Hara Veeramallu : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఆయన హీరో గా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం ఎన్ని ఏళ్ళ నుండి సెట్స్ మీద ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అనేక కారణాల చేత షూటింగ్స్ వాయిదా పడుతూ వచ్చింది. 2020 వ సంవత్సరం లో ఈ సినిమాని మొదలు పెట్టారు. దాదాపుగా ఐదేళ్లు పూర్తి అయ్యింది. ఒక సినిమా ఐదేళ్ల పాటు సెట్స్ మీద ఉండడం ఇప్పటి వరకు తెలుగు సినిమా హిస్టరీ లో ఎప్పుడూ జరగలేదు. ఈ సినిమా విషయం లోనే జరిగింది. పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాక బాగా బిజీ అవ్వడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడం, నిర్మాత రెండు సార్లు ఈ చిత్రాన్ని వాయిదా వేయడం వంటివి జరిగింది. ఇప్పుడు ఆ సమస్య లేదు. నిన్న సాయంత్రం నుండి పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
Also Read : అభిమానులను పిచ్చెక్కిస్తున్న ‘హరి హర వీరమల్లు’ టీం మౌనం..అసలు ఏమి జరుగుతుంది?
కోకాపేట లో ఉన్నటువంటి ‘ఆచార్య’ మూవీ సెట్స్ లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. నిన్న సాయంత్రం నుండి దాదాపుగా 5 గంటల పాటు షూటింగ్ జరిగిందట. నేడు కూడా ఈ షూటింగ్ కొనసాగనుంది. ఈ రెండు రోజుల షూటింగ్ తో సినిమా మొత్తం పూర్తి అయ్యినట్టే. ఈ షూటింగ్ సెట్స్ లో పవన్ కళ్యాణ్ తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా జాయిన్ అయ్యాడు. ఆయన కూడా షాట్ మేకింగ్ విషయం లో డైరెక్టర్ జ్యోతి కృష్ణకు సలహాలు, సూచనలు ఇస్తున్నట్టు సమాచారం. అంత బాగానే ఉంది కానీ, ‘ఆచార్య’ మూవీ సెట్స్ లో షూటింగ్ చేయడం పై అభిమానులు భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ సెట్స్ లో షూట్ చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఆచార్య సమయం లో నిర్మాత నిరంజన్ ఒక సరికొత్త గ్రామాన్ని నిర్మించాడు.
ఆ సినిమా షూటింగ్ పూర్తి అవ్వగానే, సెట్స్ పీకేయలేదు. అనేక మంది మాకు ఆ సెట్స్ కావాలని రిక్వెస్ట్ చేయడంతో, ఆ సెట్స్ ని లీజ్ కి ఇస్తూ వచ్చారు. సల్మాన్ ఖాన్ నటించిన ‘కిసీ కా భాయ్..కిసీ కా జాన్’ చిత్రం షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. అలా ఎన్నో సినిమాలా షూటింగ్స్ జరిగాయి. అలాంటి ప్రాంతంలో షూటింగ్ అవసరమా అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా లో నిర్మాతలను ట్యాగ్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ మరో రెండు రోజుల్లో గ్రాండ్ గా మొదలు కాబోతున్నాయి. ముందుగా ఒక మంచి మాస్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఆ తర్వాత మేకింగ్ వీడియో, థియేట్రికల్ ట్రైలర్, ఇంటర్వ్యూస్, ఇలా ఈ నెల మొత్తం పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగే. మే 30 లేదా జూన్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.
Also Read : హరి హర వీరమల్లు’ కి హాలీవుడ్ హీరో ‘టామ్ క్రూజ్’ గండం..ఇలా అయితే కష్టమే!