Donald Trump : మన తెలుగు సినిమాలకు అత్యధిక లాభాలు తెచ్చిపెట్టే మార్కెట్ ఓవర్సీస్. దూకుడు, గబ్బర్ సింగ్ సినిమాలతో ఈ మార్కెట్ మనకు క్రియేట్ అయ్యింది. ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కి కంచుకోట లాగా మారింది. కేవలం ఈ ఒక్క ప్రాంతం నుండే ఇప్పుడు వందల కోట్ల గ్రాస్ వసూళ్లు వస్తున్నాయి. మన టాలీవుడ్ కి ఓవర్సీస్ లో నార్త్ అమెరికా నుండి అత్యధిక వసూళ్లు వస్తుంటాయి. స్టార్ హీరోలకే కాదు, మీడియం రేంజ్ హీరోలకు కూడా ఈ మార్కెట్ ఇచ్చే బూస్ట్ అంతా ఇంతా కాదు. రీసెంట్ గా విడుదలైన నాని ‘హిట్ 3’ చిత్రానికి కేవలం నాలుగు రోజుల్లోనే రెండు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), మహేష్ బాబు(Super Star Mahesh Babu) , ప్రభాస్(Rebelstar Prabhas) లాంటి సూపర్ స్టార్స్ సినిమాలకు కేవలాం ప్రీమియర్ షోస్ నుండి మూడు మిలియన్ డాలర్ల గ్రాస్ ఇచ్చే మార్కెట్ ఇది.
Also Read : నాకు పద్మభూషణ్ ఇస్తే సరిపోదు..ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలి – నందమూరి బాలకృష్ణ
ఇలాంటి మార్కెట్ ఇక మీదట మన తెలుగు సినిమాలకు ఉండబోదా అంటే అవుననే అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కాసేపటి క్రితమే ఫారిన్ సినిమాలకు 100 శాతం టారిఫ్ వెయ్యాలని, తక్షణమే ఈ ప్రక్రియ ని మొదలు పెట్టాలి అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసాడు. ఇది టాలీవుడ్ కి మాత్రమే కాదు, అన్ని దేశాల సినిమాలకు పెద్ద షాక్. ట్రంప్ మాట్లాడుతూ ‘అమెరికన్ సినిమా రోజు రోజుకి బలహీన పడుతుంది. ఇతర దేశాల నుండి వస్తున్న సినిమాలు మా అమెరికా నుండి భారీ లాభాలను అర్జిస్తున్నాయి. దీనివల్ల హాలీవుడ్ బాగా దెబ్బతినింది. ఇది మేము జాతీయ భద్రత కి విఘాతం గా భావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంటున్నాము’ అంటూ ఒక ప్రకటన చేశాడు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం నిర్మాతలకు కోలుకోలేని దెబ్బ కొట్టింది.
వంద శాతం టారిఫ్ అంటే టికెట్ రేట్స్ ఇప్పుడు ఉన్న దానికంటే భారీ గా పెరిగిపోతాయి. ఉదాహరణకు మీడియం రేంజ్ హీరోల సినిమాలకు సంబంధించిన టికెట్ రేట్స్ కేవలం 15 డాలర్లు మాత్రమే ఉంటుంది. కానీ పెద్ద హీరోల సినిమాలకు టికెట్ రేట్ 25 నుండి 35 డాలర్లు ఉంటుంది. ఇప్పుడు ఈ టారిఫ్ కారణంగా 15 డాలర్లు పెట్టి చూడాల్సిన సినిమాలను 30 డాలర్లు, 30 డాలర్లు పెట్టి చూడాల్సిన సినిమాలను 70 డాలర్లు టికెట్ కోసం ఖర్చుపెట్టి చూడాలి. ఇదే కనుక జరిగితే బయ్యర్స్ అక్కడ సినిమాలను విడుదల చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది సినిమా ఇండస్ట్రీ కి చావు దెబ్బ అనే చెప్పొచ్చు. అమెరికా కి కూడా ఆర్ధిక నష్టం గట్టిగానే ఉంటుంది. ఎందుకంటే అక్కడ అత్యధిక శాతం సినీ రెవిన్యూ ఫారిన్ సినిమాల ద్వారా మాత్రమే వస్తుంది. అందరూ అమెరికా లో విడుదల చేయడం బ్యాన్ చేస్తే, అక్కడ థియేటర్స్ మూసుకోవాల్సి పరిస్థితి ఏర్పడుతుంది.