Hari Hara Veeramallu : 2020 వ సంవత్సరం లో మొదలై, కేవలం 9 నెలల్లో పూర్తి చేద్దామని మొదలైన ప్రాజెక్ట్ ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu). పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), క్రిష్(Krish Jagarlamudi) కాంబినేషన్ లో మొదలైన ఈ సినిమాపై అప్పట్లో అంచనాలు మామూలు రేంజ్ లో ఉండేవి కాదు. ఇప్పుడంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ‘ఓజీ’ చిత్రంపై విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు కానీ, ఆ రోజుల్లో మాత్రం ‘హరి హర వీరమల్లు’ చిత్రం పైనే అంచనాలు తారాస్థాయిలో ఉండేవి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని ఇలాంటి గెటప్ లో అభిమానులు ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి జానర్ సినిమాలు ఆయన చేస్తాడని బహుశా వాళ్ళు కలలో కూడా ఊహించి ఉండరు. అలాంటి జానర్ లో పవన్ కళ్యాణ్ కనిపిమ్చబోతున్నాడు అనే వార్త రావడంతో వాళ్ళ ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి. అందుకు తగ్గట్టుగానే మొదటి గ్లింప్స్ వీడియో ఫ్యాన్స్, ఆడియన్స్ మైండ్ ని బ్లాక్ అయ్యేలా చేసింది.
Also Read : కేజీఎఫ్ 3′ కి ముహూర్తం ఫిక్స్..మరి ఎన్టీఆర్ సినిమా పరిస్థితి ఏంటి?
అలా భారీ అంచనాలను రేకెత్తించిన ఈ సినిమా, కొన్ని అనివార్య కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన క్రిష్ కూడా మధ్యలోనే తప్పుకోవడంతో పాపం నిర్మాతకు ఈ సినిమాని పూర్తి చేయడం పెద్ద సవాల్ గా మారింది. అయితే నిర్మాత AM రత్నం కొడుకు జ్యోతి కృష్ణ మిగిలిన సినిమాకి దర్శకత్వం వహించే బాధ్యతలను చేపట్టాడు. షూటింగ్ ని పరుగులు తీయించి ఎట్టకేలకు చివరి దశకు తీసుకొచ్చాడు. దాదాపుగా 11 సార్లు విడుదల తేదీని ప్రకటించి వాయిదా వేస్తూ వచ్చిన ఈ చిత్రం, ఎట్టకేలకు ‘మే 9’ న విడుదల చేయబోతున్నామని ఒక పోస్టర్ ద్వారా అధికారిక ప్రకటన చేశాడు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉంది, పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షూటింగ్ కూడా నాలుగు రోజుల బ్యాలన్స్ ఉంది. దీంతో మరోసారి ఈ సినిమా వాయిదా పడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ చిత్రాన్ని మే 23న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అదే కనుక జరిగితే ఓవర్సీస్ లో ఈ చిత్రానికి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే అదే రోజున హాలీవుడ్ యాక్షన్ హీరో ‘టామ్ క్రూజ్'(Tom Cruise) నటిస్తున్న ‘మిషన్ ఇంపాజిబుల్’ సిరీస్ లో చివరి చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాపై కేవలం ఓవర్సీస్ లోనే కాదు, మన ఇండియా లో కూడా అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా కారణంగా నార్త్ అమెరికాలో ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి ఐమాక్స్ షోస్ దొరకడం కష్టమని తెలుస్తుంది. ఈ షోస్ దొరకకపోతే దాదాపుగా 1 మిలియన్ కి పైగా గ్రాస్ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకే ఆ తేదీన విడుదల చేయొద్దని అంటున్నారు ఫ్యాన్స్. మరి మేకర్స్ మనసులో ఏముందో చూడాలి.