Hari Hara Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం మరో 8 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. విడుదలకు ముందు ఒక సినిమాకు ఎంత నెగటివ్ ప్రచారాలు జరిగితే నష్టం ఉంటుందో, అలాంటి నెగటివ్ ప్రచారాలు ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో ఈ సినిమా విషయం లో జరిగింది. ఆర్ధిక నష్టాల్లో కూరుకుపోయిన నిర్మాత AM రత్నం ఈ సినిమాని ఎన్నో అడ్డంకులను ఎదురుకొని ఇంత దూరం తీసుకొని రావడమే ఒక పెద్ద సాహసం. పవన్ కళ్యాణ్ కాకుండా మరో హీరో ఇదే సినిమా లో నటించి ఉండుంటే అసలు ఎప్పటికీ విడుదల అయ్యేది కాదు. ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదల కాబోతున్న సినిమా కావడం ఈ సినిమాకు పెద్ద అదృష్టం గా భావించవచ్చు. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుంది అనే విషయం ప్రతీ ఒక్కరికి తెలుసు. డైరెక్టర్ క్రిష్ ఉన్నప్పుడు కేవలం ఒక్క భాగం లో తెరకెక్కించాలని అనుకున్నారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత రెండు భాగాలుగా తెరకెక్కించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రెండవ భాగం షూటింగ్ మొదలై ఒక 20 నిమిషాల కంటెంట్ కూడా సిద్ధంగా ఉందని ఆ చిత్రం లో హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. అంతే కాదు క్లైమాక్స్ తర్వాత వచ్చే క్లిఫ్ హ్యాంగర్ సన్నివేశం లో రెండవ భాగం కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చూపిస్తారంట. బాహుబలి మొదటి భాగం చివర్లో ఎలా అయితే రెండవ భాగానికి సంబంధించిన షాట్స్ చూపించారో, అలా అన్నమాట.
ప్రస్తుతానికి ఈ విషయాన్ని గోప్యంగానే ఉంచారు. డైరెక్ట్ గా థియేటర్స్ లో చూసే ఆడియన్స్ కి కచ్చితంగా థ్రిల్లింగ్ ఫీలింగ్ కలిగించేందుకే ఇలా చేసారని టాక్. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఒక పాట ఉందట. ఈ పాటని నేరుగా ఈ నెల 20న వైజాగ్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదల చేస్తారట. బాహుబలి చిత్రం లో నిప్పులే శ్వాసగా అనే పాట ఉంది కదా?, ఆ తరహా మోడ్ లో ఈ పాట ఉంటుందట. సోమవారం నుండి అడ్వాన్స్ బుకింగ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే మరికొన్ని అప్డేట్స్ సోషల్ మీడియా లో రానున్నాయి. ఫ్యాన్స్ ఇప్పటికే అప్డేట్స్ లేవని సోషల్ మీడియా లో మూవీ టీం ని ట్యాగ్ చేసి పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు. ఆ గొడవకు మూవీ టీం ఎంత తొందరగా తెరదించితే అంత మంచిది అని విశ్లేషకుల అభిప్రాయం.