https://oktelugu.com/

Hari Hara Veera Mallu: క్లైమాక్స్ కి చేరుకున్న ‘హరి హర వీరమల్లు’.. సారధి స్టూడియోస్ లో భారీ సెట్స్

రీసెంట్ గానే ఈ మూవీ కి సంబంధించిన ముంబై షెడ్యూల్ పూర్తి అయ్యింది, ఈరోజు నుండి పూణే లో రెండవ షెడ్యూల్ ప్రారంభం అయ్యింది. పవన్ కళ్యాణ్ మరియు హీరోయిన్ ప్రియాంక మోహన్ మధ్య ఒక సాంగ్ ని ఈ షెడ్యూల్ లో చిత్రీకరించబోతున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : May 3, 2023 / 08:35 AM IST
    Follow us on

    Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న సినిమాలలో ఆడియన్స్ ఎంతో అమితాసక్తి తో ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ డైరెక్టర్ క్రిష్ గత మూడేళ్ళ నుండి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మధ్యలో కరోనా రావడం వల్ల మూవీ షూటింగ్ చాలా రోజుల వరకు వాయిదా పడింది.

    ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వేరే సినిమాలకు కమిట్ అవ్వడం, మధ్యలో రాజకీయ కార్యకలాపాలలో ఫుల్ బిజీ అవ్వడం వల్ల , ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే కొంతకాలం క్రితమే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ఇంటర్వెల్ సన్నివేశాన్ని రామోజీ ఫిలిం సిటీ లో సుమారుగా రెండు నెలలు షూటింగ్ జరిపారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ #PKSDT మూవీ షూటింగ్ లో బిజీ అయిపోయాడు,ఇప్పుడు గత నెల రోజుల నుండి #OG మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

    రీసెంట్ గానే ఈ మూవీ కి సంబంధించిన ముంబై షెడ్యూల్ పూర్తి అయ్యింది, ఈరోజు నుండి పూణే లో రెండవ షెడ్యూల్ ప్రారంభం అయ్యింది. పవన్ కళ్యాణ్ మరియు హీరోయిన్ ప్రియాంక మోహన్ మధ్య ఒక సాంగ్ ని ఈ షెడ్యూల్ లో చిత్రీకరించబోతున్నారు. మే 8 వరకు ఈ షెడ్యూల్ జరగనుంది, ఆ తర్వాత ఆయన మూడవ వారం నుండి ‘హరి హర వీరమల్లు’ సినిమా కోసం డేట్స్ మొత్తాన్ని కేటాయించేసాడు.

    దాదాపుగా షూటింగ్ కార్యక్రమాలన్నిటినీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం , ఇప్పుడు క్లైమాక్స్ కి చేరుకుంది. మే మూడవ వారం నుండి నెలరోజులకు పైగా సాగనున్న ఈ షెడ్యూల్ లో ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు వచ్చే సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నారు. దీనితో సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానుంది, సారధి స్టూడియోస్ ఇందుకోసం భారీ సెట్స్ ని కూడా ఏర్పాటు చేసాడు నిర్మాత AM రత్నం.ఈ దసరా కానుకగా ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.