Gopichand- Prabhas: టాలీవుడ్ లో నేటి తరం స్టార్ హీరోల మధ్య ఎంత మంచి స్నేహం ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా స్నేహితులు అనే పేరు తీస్తే మనకి గుర్తుకు వచ్చే హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఒక్క పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు తప్ప, మిగిలిన అందరు హీరోలు ప్రభాస్ కి క్లోజ్ ఫ్రెండ్స్.
ముఖ్యంగా రామ్ చరణ్ , గోపీచంద్ , జూనియర్ ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ తో ప్రభాస్ ఎక్కువగా క్లోజ్ గా ఉంటాడు. హీరో గోపీచంద్ తో ఆయన స్నేహం నిన్న మొన్నటిది కాదు, ఏకంగా 20 ఏళ్ళ స్నేహబంధం వీళ్ళిద్దరిది. వర్షం సినిమా తో ప్రారంభమైన వీళ్ళ స్నేహం, ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. వీళ్ళ స్నేహం ఎంత చూడముచ్చటగా ఉంటుందో ప్రభాస్ ముఖ్య అతిథి గా హాజరైన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షో చూసి తెలుసుకోవచ్చు.
ఇది ఇలా ఉండగా గోపీచంద్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రామబాణం’ ఈనెల 5 వ తేదీన విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గోపీచంద్ పలు ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఒక విలేఖరి గోపీచంద్ ని ప్రశ్న అడుగుతూ ‘మీరు మరియు ప్రభాస్ కూర్చొని సిట్టింగ్ (మందు తాగుతున్నప్పుడు) వేసినప్పుడు ఎలా ఉంటారు’ అని అడుగుతాడు.
దానికి గోపీచంద్ సమాధానం చెప్తూ ‘మీరు మీ స్నేహితులతో సిట్టింగ్ వేసినప్పుడు ఎలా ఉంటుందో, మేమిద్దరం సిట్టింగ్ వేసినప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఫుల్లుగా ఎంజాయ్ చేస్తాం, ప్రభాస్ ఆ సమయం లో మంచి జోక్స్ వేస్తుంటాడు’ అని గోపీచంద్ సమాధానం ఇస్తాడు.ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.