https://oktelugu.com/

Roja Ramani: సీనియర్ ఎన్టీఆర్ నా కాళ్ళు పట్టుకొని ఏడ్చాడు అంటూ హీరో తరుణ్ తల్లి రోజారమణి షాకింగ్ కామెంట్స్

తరుణ్ తల్లి రోజారమని విషయానికి వస్తే ఈమె డబ్బింగ్ ఆర్టిస్టుగా గా ఎంతో మంది హీరోయిన్స్ కి తన అద్భుతమైన గాత్రం అందించింది ఆరోజుల్లో.ఇక బాలనటిగా ఈమె సాధించిన విజయాలు, అందుకున్న పురస్కారాలు మామూలివి కాదు. భక్త ప్రహళ్లాద చిత్రం లో ఈమె నటించిన నటనకి గాను జాతీయ అవార్డు కూడా దక్కింది.

Written By:
  • Vicky
  • , Updated On : May 3, 2023 / 08:42 AM IST
    Follow us on

    Roja Ramani: ఇండస్ట్రీ లో ఉన్న ఎంతమంది లెజండరీ నటీనటులలో ఒకరు రోజా రమణి.ఈమె ప్రముఖ హీరో తరుణ్ కి తల్లి అనే విషయం అందరికీ తెలిసిందే. ఈమె బాలనటిగా , హీరోయిన్ గా క్యారక్టర్ ఆర్టిస్టు గా ఎన్నో వందల సినిమాల్లో నటించింది.తల్లి లాగానే కొడుకు కూడా బాలనటుడిగా గొప్పగా రాణించి, ఆ తర్వాత హీరో గా కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించి,ఇప్పుడు సినిమాలకు దూరంగా , పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ గా కొనసాగుతున్నాడు.

    ఇక తరుణ్ తల్లి రోజారమని విషయానికి వస్తే ఈమె డబ్బింగ్ ఆర్టిస్టుగా గా ఎంతో మంది హీరోయిన్స్ కి తన అద్భుతమైన గాత్రం అందించింది ఆరోజుల్లో.ఇక బాలనటిగా ఈమె సాధించిన విజయాలు, అందుకున్న పురస్కారాలు మామూలివి కాదు. భక్త ప్రహళ్లాద చిత్రం లో ఈమె నటించిన నటనకి గాను జాతీయ అవార్డు కూడా దక్కింది.

    అంతే కాదు, ఈమె బాలనటిగా మహానటుడు నందమూరి తారకరామారావు తో ఎన్నో సినిమాల్లో నటించింది, ఆయనతో తనకి ఉన్న మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది, ఆమె మాట్లాడుతూ ‘ఎన్టీఆర్ అంటే నాకు ఎంతో ప్రత్యేకమైన అభిమానం, ఆ మహానుభావుడితో కలిసి సినిమాలు చెయ్యడం నా అదృష్టం గా భావిస్తున్నాను. ఆయనతో నేను చేసిన మొట్టమొదటి చిత్రం ‘తాతమ్మ కల’. ఈ సినిమాకి ఆయన దర్శకత్వం వహిస్తూ, నిర్మాతగా కూడా వ్యవహరించాడు.ఈ చిత్రం తర్వాత ఆయన తో నాలుగైదు సినిమాల్లో నటించే భాగ్యం దక్కింది.ఆయన నటించిన ‘డ్రైవర్ రాముడు’ అనే చిత్రం లో నేను చెల్లి పాత్ర ని చేశాను.’ఏమని వర్ణించను..’ అంటూ సాగే పాటలో బ్రిడ్జి పై నుండి దూకడానికి వెళ్ళాలి.ఆ సన్నివేశం లో ఎన్టీఆర్ నా కాళ్ళు పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంటే డైరెక్టర్ రాఘవేంద్ర రావు సీన్ కి కట్ చెప్పకుండా అలా చూస్తూ ఉండిపోయాడు’ అంటూ రోజారమని చెప్పుకొచ్చింది.