Hari Hara Veeramallu Boycott: సినీ వేడుకల్లో సినిమాల గురించి మాత్రమే మాట్లాడాలి, రాజకీయాల గురించి మాట్లాడకూడదు, అది నైతికంగా కరెక్ట్ అనిపించుకోదు. కానీ మెగా ఈవెంట్స్ లో ఈమధ్య రాజకీయాల గురించి తెగ మాట్లాడేస్తున్నారు. వైసీపీ పార్టీ దారుణంగా ఓడిపోవడం పదే పదే ఆ పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బ తీసేలా మాట్లాడడం ని ఎవ్వరూ తీసుకోలేకపోతున్నారు. ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమెడియన్ పృథ్వీ రాజ్ మాజీ సీఎం జగన్ పై నోరు పారేసుకోవడం తో , జగన్ అభిమానులు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున గేమ్ చేంజర్ చిత్రాన్ని బాయ్ కాట్ చేయమంటూ ప్రచారం చేశారు. వాళ్ళ ప్రచారం వల్ల సినిమా ఫ్లాప్ అయ్యింది అనడం సబబు కాదు కానీ, సినిమా కంటెంట్ వల్ల ఫ్లాప్ అయ్యింది అని అనుకోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా రఘు రామ కృష్ణంరాజు మాజీ సీఎం జగన్ పై కామెంట్స్ చేసాడు.
దీంతో వైసీపీ అభిమానుల ఆవేశం కట్టలు తెంచుకుంది. ‘#BanHHVM’ అంటూ నేషనల్ వైడ్ గా ట్రేండింగ్ చేస్తూ కొన్ని వేల ట్వీట్స్ వేశారు. దీంతో వైసీపీ అభిమానులు మా వల్లే ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది, మాతో పెట్టుకోకండి అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి వార్నింగ్ ఇస్తున్నారు. కానీ ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కూడా ప్రధాన కారణం కంటెంట్ బాగాలేకపోవడం వల్లే అనేది వాస్తవమే అయినా, వైసీపీ అభిమానుల్లో సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ అని అభిమానించే వాళ్ళు, 2024 ఎన్నికలలో తమ నాయకుడు ఘోరంగా ఓడిపోవడానికి పవన్ కళ్యాణ్ కూడా ఒక కారణం అవ్వడం తో, వాళ్ళు ఈ చిత్రాన్ని చూడడం ఆపేశారని, అందుకే వైసీపీ అభిమానులు ఎక్కువగా ఉండే నెల్లూరు జిల్లాలో ఈ చిత్రానికి మొదటి రోజు చాలా తక్కువ వసూళ్లు వచ్చాయని అంటున్నారు.
Also Read: వార్ 2 ట్రైలర్ Jr NTR ఫాన్స్ ని ఇంప్రెస్ చేసిందా?
అందులో ఎంతో కొంత నిజముంది. నెల్లూరు, రాయలసీమ జిల్లాలో రాజకీయ పరంగా జగన్ ని అభిమానించే వారే, పవన్ కళ్యాణ్ ని సినిమాల పరంగా అభిమానిస్తున్నారు. వారిలో అత్యధిక శాతం మంది ఈ సినిమాని చూడడం బ్యాన్ చేయడం వల్లనే నెల్లూరు జిల్లాలో కలెక్షన్స్ పై ప్రభావం చూపించింది అనేది విశ్లేషకుల వాదన కూడా. ఏది ఏమైనా సినిమా అయితే ఫ్లాప్ అయ్యింది. కానీ నైజాం ప్రాంతంలో మాత్రం కొన్ని సెంటర్స్ లో ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అవుతున్నాయి. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చిన్నగా ఈ సినిమాని ఆదరించడం మొదలు పెడుతున్నారు కావొచ్చు. అది ఎంత వరకు నిజమో రేపు, ఎల్లుండి వచ్చే కలెక్షన్స్ ని బట్టి చెప్పొచ్చు. సినిమాలో VFX కంటెంట్ ని కూడా మార్చి కొత్త కాపీ ని పంపుతామని మేకర్స్ అన్నారట. మరి దాని వల్ల పబ్లిక్ లో టాక్ ఏమైనా పెరుగుతుందో లేదో చూడాలి.