War 2 trailer impress NTR fans: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న వాళ్ళలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు… పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించిన ఆయన వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక దాంతో పాటుగా ఇప్పుడు బాలీవుడ్ వాళ్లతో కొలాబ్రేట్ అయి వార్ 2 సినిమా చేస్తున్నాడు. హృతిక్ రోషన్ తో కలిసి ఈ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక గత కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. అందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ ని చాలా డిఫరెంట్ డిజైన్ చేశారు. ఇక దాంతోపాటుగా ఆయన క్యారెక్టర్ లో వేరియేషన్స్ ని కూడా చూపించారు. యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా ఎన్టీఆర్ చాలా వరకు ఎఫెక్టివ్ గా కనిపించడంతో ఈ ట్రైలర్ మీద ఎన్టీఆర్ అభిమానులకు చాలా మంచి అంచనాలైతే ఏర్పడ్డాయి… అయితే ఎన్టీఆర్ ఇంతకుముందు రామ్ చరణ్ తో కలిసి చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా లో అతనిది సెకండ్ హీరో పాత్ర అని చాలామంది అతన్ని విమర్శించారు. మరి ఈ సినిమా ట్రైలర్ ని చూసినట్లయితే ఇందులో హృతిక్ రోషన్ క్యారెక్టర్ తో పాటు ఎన్టీఆర్ కి కూడా సమానమైన గుర్తింపు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ట్రైలర్ వరకే అతనికి సమానమైన ఇంపార్టెన్స్ ఇచ్చారా సినిమాలో కూడా హృతిక్ రోషన్తో పాటు అతని క్యారెక్టర్ కి కూడా మంచి గుర్తింపు వస్తుందా?
లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే… జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ ట్రైలర్ తో అంత పెద్దగా ఇంప్రెస్ అవ్వలేదని తెలుస్తోంది. ఎందుకంటే ఆయన తన యాక్షన్ కి కాకుండా నటనకి స్కోప్ ఉండేలా ఈ ట్రైలర్ ని కట్ చేశారని అనుకున్నారట.
Also Read: వార్ 2 ని తట్టుకొని కూలి నిలబడతాడా
కానీ అతని అంచనాలకు విరుద్ధంగా యాక్షన్ ఎలిమెంట్స్ ని ఎక్కువగా ఎలివేట్ చేస్తు ట్రైలర్ ఇవ్వడం అనేది అంత పెద్దగా నచ్చలేదట. యాక్షన్ ఎపిసోడ్స్ ను థియేటర్ లో సర్ప్రైజ్ గా చూస్తే బాగుంటుంది. కానీ ఇక్కడే రివిల్ చేసి చూపిస్తే థియేటర్ లో ప్రేక్షకుడికి ఆ సీన్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదని తెలుస్తోంది…
ఇంక దానికి తోడుగా జూనియర్ ఎన్టీఆర్ ది హృతిక్ రోషన్ కంటే మెయిన్ లీడ్ పాత్ర అని చెప్పారు. ఇద్దరికి సమానమైన క్యారెక్టర్ లను రాసినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…