HHVM Movie Flexi Removed: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యుండొచ్చు..కోట్లాది మంది అభిమానులు ఉండొచ్చు..కానీ ఆడియన్స్ ని మూడు గంటలపాటు థియేటర్ లో కూర్చోబెట్టాలంటే అవి సరిపోదు, సినిమాలో బలమైన కంటెంట్ ఉండాలి, అప్పుడే ఆడుతుంది, లేకపోతే ఈ ఓటీటీ కాలం లో ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమా అయినా రెండో రోజే ఎత్తిపోతుంది అనడానికి నిదర్శనం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం. ఈ చిత్రం మొన్న రాత్రి ప్రీమియర్ షోస్ నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శితమైంది. ప్రీమియర్ షోస్ అంటే మొత్తం ఫ్యాన్స్ నే ఎక్కువ చూస్తారు. టికెట్ రేట్ 700 పెట్టినా ఎగబడి మరీ చూసేసారు. కానీ సినిమాలో బలమైన విషయం లేకపోవడం వల్ల ప్రీమియర్ షోస్ నుండే ఘోరమైన నెగటివ్ టాక్ వచ్చింది. అభిమానుల ఆర్తనాదాలతో సోషల్ మీడియా మొత్తం ఊగిపోయింది. పబ్లిక్ మీద ఏ మాత్రం గౌరవం లేకుండా, ఇలాంటి నాసిరకపు VFX తో సినిమాని మా ముఖం మీద కొడతారా?, అసలు ఎలా కనిపిస్తున్నాం మీకు అంటూ అభిమానులే నిలదీయడం మొదలు పెట్టారు.
Also Read: ‘హరి హర వీరమల్లు’ బాయికాట్ అన్నారు.. మరి అది పనిచేసిందా?
ఇంతటి ఘోరమైన నెగటివ్ టాక్ వచ్చిన తర్వాత ఇక రెండవ రోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయో మీరే ఊహించుకోవచ్చు. పవన్ కళ్యాణ్ కి కంచుకోట గా పిలవబడే ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా రెండవ రోజు కనీస స్థాయి వసూళ్లను కూడా నూన్ షోస్ నుండి నమోదు చేసుకోవడం లేదు. అనేక ప్రాంతాల్లో జనాలు లేక షోస్ ని రద్దు చేస్తున్నారు. సోషల్ మీడియా లో రెండవ రోజు ‘హరి హర వీరమల్లు’ బ్యానర్స్ ని ఎత్తివేస్తున్న వీడియో హల్చల్ చేస్తుంది. ఈ వీడియో ని ఒక వైసీపీ అభిమాని షేర్ చేసాడు. ‘అధికారం చేతుల్లో ఉంటేనే..ఎక్కువ ఫ్యాన్స్ ఉంటేనే సినిమాలు ఆడవురా..కంటెంట్ ఉంటేనే ఆడుతాయి’ అంటూ చెప్పుకొచ్చాడు.
అతను యాంటీ ఫ్యాన్ అయినా కరెక్ట్ గానే చెప్పాడు కదా అని అభిమానులు సైతం సర్ది చెప్పుకుంటున్నారు. నిజంగా సెకండ్ హాఫ్ చూస్తే అభిమానులకు కూడా కోపం రాక తప్పదు. కంటెంట్ మొత్తం రఫ్ కాపీ లాగానే అనిపించింది. సెకండ్ హాఫ్ లో అభిమానులు కేరింతలు కొట్టే ఒక్క సన్నివేశం కూడా లేదు. దానికి తోడు అత్యంత నీచమైన గ్రాఫిక్స్. టీవీ సీరియల్స్ లో కూడా మీరు అలాంటి గ్రాఫిక్స్ ని చూసి ఉండరు. అభిమానుల నుండి ఈ రేంజ్ నెగటివ్ టాక్ రావడం తో మేకర్స్ ఈ చిత్రం లోని గ్రాఫిక్స్ బాగాలేని సన్నివేశాలను 15 నిమిషాల వరకు కట్ చేశారట. చేతులు కాలిన తర్వాత ఆకులను పట్టుకోవడం అంటే ఇదే. ఇప్పటికే నెగటివ్ టాక్ వైల్డ్ ఫైర్ లాగా వ్యాప్తి చెందింది. ఇప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం ఏముంది చెప్పండి అంటూ సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్ చేస్తున్నారు.