Cyber Security Tips: ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి రంగంలో పనులు చాలా సులువుగా మారిపోయాయి. దీంతో చాలామంది టెక్నాలజీ వాడుకొని ఈజీగా తమ కార్యకలాపాలను నిర్వహించుకుంటున్నారు. అయితే ఇంటర్నెట్ ఉపయోగించడం వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో.. అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. కొందరు సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాదారుల సమాచారం తెలుసుకొని అకౌంట్ ల నుంచి డబ్బులను దోచుకుంటున్నారు. కొన్ని లెక్కల ప్రకారం 2024 సంవత్సరంలో 22 వేలకోట్లు వినియోగదారులు మోసపోయినట్లు తెలుస్తోంది. దీనిబట్టి ఫైబర్ నేరగాళ్ల ఆగడాలు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆన్లైన్ వ్యవహారాలు జరిపేవారు జాగ్రత్తగా ఉండాలి. ఇందుకు సంబంధించి కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటంటే?
Also Read: ఎయిర్ టెల్ యూజర్స్ కు ఇదో బంపర్ ఆఫర్
ప్రతి ఒక్కరి సమాచారం అంతా నేటి కాలంలో ఈ మెయిల్ లోనే ఉంటుంది. ఫైల్స్ తోపాటు ముఖ్యమైన ఇన్ఫర్మేషన్.. బ్యాంకుకు సంబంధించిన సమాచారం అంతా ఇమెయిల్కు పంపిస్తూ ఉంటారు. ఒక్కోసారి కొన్ని రకాల డాక్యుమెంట్లు కూడా ఈమెయిల్లోనే భద్రపరచుకోవాల్సి వస్తుంది. అయితే ఈ ఇమెయిల్ పాస్వర్డ్ క్రియేట్ చేసేటప్పుడు పగడ్బందీగా ఉండాలి. దీని పాస్వర్డ్ సాధారణంగా కాకుండా క్యాపిటల్ లెటర్స్, న్యూమరికల్ లెటర్స్ వాడి కఠినంగా ఏర్పాటు చేసుకోవాలి. అలా చేస్తేనే ఈమెయిల్ భద్రంగా ఉంటుంది.
కంప్యూటర్ పై పని చేసేవారు తమ సాఫ్ట్వేర్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. చాలా రోజుల వరకు ఒకే ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తే హాక్ కు గురయ్యే అవకాశం ఉంటుంది. అప్డేట్ చేయడం వల్ల వైరస్ నుంచి కాపాడుకోవడమే కాకుండా.. సైబర్ నేరగాళ్లకు ఎటువంటి సమాచారం వెళ్లకుండా ఉంటుంది. కేవలం కంప్యూటర్ మాత్రమే కాకుండా మొబైల్ ఫోన్ లోని యాప్స్ కూడా అప్డేట్ చేస్తూ ఉండాలి. మొబైల్ లోని సాఫ్ట్వేర్ అప్డేట్ అడిగినప్పుడు వెంటనే చేసుకోవడం ఉత్తమం.
Also Read: కెరీర్లో సక్సెస్ కావాలంటే ఈ 10 స్కిల్స్ ఉండాల్సిందే.. హర్ష్ గోయెంకా సూచనలివే
బ్యాంకుకు సంబంధించిన అకౌంట్ ఇన్ఫర్మేషన్, క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ సంబంధించిన సమాచారం ఇమెయిల్ కు వస్తుంటుంది. అయితే ఈ ఈమెయిల్ పాస్వర్డ్ కూడా హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ పాస్వర్డ్ టూ స్టెప్ ను ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాకుండా అనుమానస్పద ఈ మెయిల్స్ వస్తే వాటిని రిజెక్ట్ చేయండి. కొన్ని రకాల ఈ మెయిల్స్ ఓపెన్ చేసినా కూడా అకౌంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ లాస్ అయ్యే అవకాశం ఉంది.
ఉచితంగా వస్తుంది కదా అని ఎక్కడా పడితే అక్కడ వైఫై వాడకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే కొందరు వైఫై ద్వారా ఫోన్ సమాచారం తెలుసుకుంటారు. ఈ ఫోన్ ద్వారా వివరాలన్నీ వారికి తెలిసిపోతాయి. అందువల్ల వైఫైతో కనెక్టు కాకుండా ఉండటమే మంచిది.
బ్యాంకుకు సంబంధించిన పాస్వర్డ్, ఇతర అకౌంట్ నెంబర్ వంటివి ఈమెయిల్ లో స్టోర్ చేసుకోకుండా ఉండాలి. ఎందుకంటే ఈమెయిల్ ఎవరైనా చూస్తే పాస్వర్డ్ మిస్ అయి అవకాశం ఉంటుంది. మొబైల్ లోను కూడా సాధారణంగా స్టోర్ కాకుండా డిఫికల్ట్గా మీకు తెలిసే విధంగా పాస్వర్డ్ ను భద్రపరుచుకోవాలి.