Hari Hara Veeramallu Trailer: హద్దులు దాటిన అనర్ధాలకు దారి తీస్తుంది. హీరోల మీద కానీ, రాజకీయ నాయకుల మీద కానీ అభిమానం పెంచుకోవడం లో ఎలాంటి తప్పు లేదు. కానీ ఆ అభిమానం చూసే వాళ్లకు వెర్రితనం అనిపించకూడదు. అలాంటి వెర్రితనం లాంటి అభిమానం నిన్న పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) మూవీ ట్రైలర్ లాంచ్ లో జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నుండి విడుదల అవుతున్న మొట్టమొదటి పాన్ ఇండియన్ చిత్రం. చాలా ఏళ్ళ నుండి అభిమానులను ఈ చిత్రం ఊరిస్తూ వచ్చింది. అనేక కారణాల చేత వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ నెల 24 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. చాలా కాలం తర్వాత వస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా కావడం తో ఈ చిత్రం ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసారు.
అభిమానుల ఉత్సాహాన్ని గమనించిన మేకర్స్, వాళ్ళ ఆనందం కోసం ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 120 థియేటర్స్ లో విడుదల చేశారు. అయితే థియేటర్స్ వద్ద అభిమానులు చేసిన హంగామా వేరే లెవెల్ లో ఉంది. కొన్ని థియేటర్స్ వద్ద అయితే అభిమానులు పైన చెప్పిన విధంగా ప్రవర్తించారు. ఒక థియేటర్ వద్ద అభిమాని చేతులు కోసుకొని, ఆ రక్తం తో పవన్ కళ్యాణ్ నుదిటి తిలకం దిద్దడం, రక్తాభిషేకం చేయడం వంటివి చేసాడు. వీటిని చూసి నెటిజెన్స్ భయపడ్డారు. అభిమానం ఉండొచ్చు కానీ మరీ ఇంతలాగానా?, అలా చేతులు కోసుకున్నప్పుడు అతని తల్లితండ్రులు చూసి ఎంత బాధపడి ఉంటారు. పవన్ కళ్యాణ్ అయినా ఇలాంటి వాటిని చూస్తే ప్రోత్సహిస్తాడా చెప్పండి?, ఆయన చూస్తే అతను ఎవరో పిలిచి నాలుగు పీకిన పీకుతాడు.
Also Read: 24 గంటల్లో 5 కోట్ల వ్యూస్..ఆల్ టైం సౌత్ ఇండియన్ రికార్డుని నెలకొల్పిన ‘హరి హర వీరమల్లు’
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనంగా మారింది. ఆ వీడియోలో ఆ అభిమాని చేసిన చర్యను సోషల్ మీడియా లో ఏ పవన్ కళ్యాణ్ అభిమాని కూడా సామర్దించడం లేదు. ఇలా చేయడం చాలా తప్పు అంటూ చెప్పుకొస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ కే ఇంత చేస్తే రేపు 24 న సినిమా విడుదల రోజు ఇంకెంత చేస్తారో తల్చుకుంటూనే భయం వేస్తుంది. దయచేసి ఇలాంటి పనులు చేయకండి, మీ తల్లితండ్రులను బాధపెట్టకండి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కోరుకుంటున్నారు. ఈ వీడియో ని చూసి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే 24 గంటల్లో 50 మిలియన్ వ్యూస్ సాధించి ఆల్ టైం సౌత్ ఇండియన్ రికార్డు ని నెలకొల్పి సంచలనం సృష్టించింది.