Hari Hara Veeramallu Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu Trailer) ట్రైలర్ నిన్న విడుదలై ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మొదటి నుండి ఈ సినిమా పై అభిమానుల్లో కానీ, ప్రేక్షకుల్లో కానీ చాలా చిన్న చూపు ఉండేది. ఎందుకంటే 5 ఏళ్ళ క్రితం మొదలైన చిత్రం, షూటింగ్స్ కి మధ్య ఎన్నో బ్రేకులు, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం, ఇలా ఎన్నో అడ్డంకులను ఎదురుకొని ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ ఏడాది లోనే ఈ చిత్రం విడుదల మూడు సార్లు వాయిదా పడింది. చివరి సారి అయితే విడుదలకు దగ్గర వరకు వచ్చి చివరి నిమిషం లో వాయిదా పడడం అభిమానులను ఎంతటి నిరాశకు గురి చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇలా ఎన్నో నెగటివ్ వైబ్స్ మధ్య నిన్న విడుదలైన ట్రైలర్ అందరిని నోరెళ్లబెట్టేలా చేసింది.
ఒక్కమాటలో చెప్పాలంటే ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూపించేసాడు. ఇక ఆయన అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా పండగ చేసుకున్నారు. ట్రైలర్ ని రికార్డ్స్ పరంగా వేరే లెవెల్ కి తీసుకెళ్లారు. 24 గంటలు కూడా గడవకముందే సౌత్ ఇండియా లో ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు ని నెలకొల్పారు. ఈ చిత్రానికి ముందు పుష్ప 2 చిత్రం 24 గంటల్లో 44 మిలియన్ కి పైగా వ్యూస్ ని సొంతం చేసుకొని ఆల్ టైం రికార్డు ని నెలకొల్పింది. ఈ రికార్డు చాలా రోజుల వరకు బ్రేక్ అవ్వకుండా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ అంచనాలే లేవు అంటూ ప్రచారం కాబడిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం అవలీలగా ఆ రికార్డు ని బ్రేక్ చేసింది. 24 గంటలు గడిచిన తర్వాత 50 మిలియన్ కి పైగా వ్యూస్ ని సొంతం చేసుకొని సంచలనం సృష్టించింది.
Also Read: దిల్ రాజు తమ్ముడు సినిమాపై నెగెటివిటీ ఎందుకింత స్ప్రెడ్ అయ్యింది?
కేవలం వ్యూస్ పరంగా మాత్రమే కాదు, లైక్స్ పరంగా కూడా ఈ ట్రైలర్ అదరగొట్టేసింది అనుకోవచ్చు. ఓవరాల్ గా 24 గంటలు గడిచిన తర్వాత 7 లక్షల 30 వేల లైక్స్ ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. ఇది ఆల్ టైం రికార్డు కాదు. ఆరంభం లో లైక్స్ కాస్త స్లో గా ఉన్నింది. దాని ప్రభావం ఫుల్ రన్ లో పడింది. కానీ అభిమానుల ప్రమేయం ఎక్కువగా లేకపోయినా కూడా ఈ రేంజ్ లైక్స్ రావడం అనేది సాధారణమైన విషయం కాదు. ఓవరాల్ ఘా ‘హరి హర వీరమల్లు ‘ కి కావాల్సినంత హైప్ వచ్చేసింది. ఇక సినిమా విడుదలై యావరేజ్ టాక్ ని తెచ్చుకున్నా చాలు, బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వేట మామూలు రేంజ్ లో ఉండదని అభిమానులు అంటున్నారు. చూడాలి మరి ఎలా ఉండబోతుంది అనేది.