Hari Hara Veera Mallu Success: సినిమా ఇండస్ట్రీలో హీరోలు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నప్పటికీ కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపు అయితే ఉంటుంది… స్టార్ హీరోలు సైతం వాళ్ళు చేసిన సినిమాలతో ప్లాపులను మూట గట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కాబట్టి చిన్న హీరోనా, పెద్ద హీరోనా అనే తేడా లేకుండా సినిమా కథ బాగుంటే మాత్రమే సినిమాలు సక్సెస్ లను సాధిస్తాయి. లేకపోతే మాత్రం డిజాస్టర్స్ అవుతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు స్టార్ హీరో గా తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇక స్టార్ హీరోలైతే మంచి మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన స్టామినాని చూపించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా సక్సెస్ మీదనే నలుగురి కెరియర్లు ఆధారపడి ఉన్నాయనే విషయం మనలో చాలామందికి తెలియదు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో సక్సెస్ ని సాధించి తను హిట్ ట్రాక్ ఎక్కాల్సిన అవసరమైతే ఉంది. ఇక జ్యోతి కృష్ణ లాంటి దర్శకుడు ఇంతకుముందు చేసిన వరుస సినిమాలు డిజాస్టర్ల బాటపడుతున్న నేపథ్యంలో ఈ సినిమాతో సక్సెస్ ని సాధించి ఎలాగైనా సరే తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక ప్రొడ్యూసర్ ఏ ఏం రత్నం సైతం మధ్యలో కొన్ని ప్లాప్ లను ఎదుర్కున్నప్పటికి ప్రొడ్యూసర్ గా తనని తాను నిలబెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఈ సినిమాతో గొప్ప విజయాన్ని సాధిస్తే తప్ప ఆయన మరోసారి స్టార్ ప్రొడ్యూసర్ గా తనను తాను ఎలివేట్ చేసుకునే పరిస్థితి అయితే ఉండబోదు. కాబట్టి ఈ సినిమా సక్సెస్ అనేది అతనికి చాలా కీలకమనే చెప్పాలి…
ఇక ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న నిధి అగర్వాల్ (Nidhi Agarwal) సైతం ఇప్పటివరకు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికి ఒక్క సక్సెస్ ని కూడా సాధించలేకపోయింది. కారణం ఏదైనా కూడా ఆమెకు ఈ సినిమా సక్సెస్ అవ్వడం అనేది చాలా కీలకమనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట రాబోతున్న సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్కరు తమను తాము స్టార్ గా ఎలివేట్ చేసుకోవాలని చూస్తున్నారు.
కాబట్టి సక్సెస్ అనేది ఇప్పుడు అందరికి కీలకంగా మారింది… మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తోంది. తద్వారా వీళ్ళ కెరియర్లు ఎలా ఉండబోతున్నాయి అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…ఇక ప్రస్తుతం సినిమా యూనిట్ మొత్తం ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ని చేపట్టాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.