HHVM movie record: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానుల ఆరేళ్ళ సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. ఆయన హీరో గా నటించిన భారీ బడ్జెట్ పీరియాడికల్ చిత్రం ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు కానీ, పూర్తి స్థాయిలో మాత్రం ఇంకా ప్రారంభించలేదు. ముఖ్యంగా నేడు రాత్రి ప్రదర్శితం అవ్వాల్సిన నైజాం ప్రీమియర్ షోస్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రక్రియ ఇంకా మొదలు పెట్టలేదు. అభిమానులు ఈ బుకింగ్స్ కోసం ఆతృతగా, ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కొద్ది గంటల్లోనే ప్రీమియర్స్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కాసేపట్లో రానుంది. ఇది కాసేపు పక్కన పెడితే బుక్ మై షో యాప్ లో ప్రారంభించిన అతి తక్కువ షోస్ నుండే ఈ చిత్రానికి మొదటి రోజు + ప్రీమియర్ షోస్ కి 1,60,0000 టిక్కెట్లు అమ్ముడుపోయాయి.
Also Read: రామ్ చరణ్ కోసం ఊరినే కొనేశారుగా..పూర్తి వివరాలు చూస్తే ఆశ్చర్యపోతారు!
ఇక పూర్తి స్థాయి బుకింగ్స్ ని మొదలు పెడితే ఏ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయో మీ ఊహలకే వదిలేస్తున్నాం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. మొత్తం మీద వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి నిన్న అర్థ రాత్రి 12 గంటల వరకు 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయి. ఇక పూర్తి స్థాయిలో ప్రీమియర్ షోస్ కి అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టి, మొదటి రోజు బుకింగ్స్ ని కూడా భారీ లెవెల్ లో ప్రారంభిస్తే ఏ రేంజ్ లో ఉంటుందో అని ఇప్పటి నుండే అంచనాలు వేసుకుంటున్నారు. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం, ఈరోజు ముగిసే సమయానికి కచ్చితంగా ఈ చిత్రం 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రాబడుతుందని అనుకుంటున్నారు.
Also Read: ఓటీటీ లో ‘8 వసంతాలు’ సంచలనం..పాన్ ఇండియన్ సినిమాలు కూడా వెనక్కి!
కానీ బుకింగ్స్ సాధ్యమైనంత తొందరగా మొదలు పెట్టాలి. ఎందుకంటే ఒక్క హైదరాబాద్ సిటీ లోనే 1500 షోస్ షెడ్యూల్ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు కేవలం 500 షోస్ మాత్రమే చేశారు. నిన్న రాత్రి వరకు ఈ చిత్రాన్ని క్యూబ్ లో అప్లోడ్ చేయకపోవడం తో అసలు ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోస్ పడుతాయా అనే అనుమానం ఉండేది. కానీ నిన్న అర్థ రాత్రి లోపు కంటెంట్ మొత్తం డెలివరీ అయిపోయింది. దీంతో ఓవర్సీస్ లో కూడా మరికాసేపట్లోనే ప్రీమియర్స్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికీ ఈ చిత్రానికి అన్నీ అనుకున్నట్టు జరిగితే, కచ్చితంగా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తాయి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.