8 Vasanthalu OTT review: కొన్ని గొప్ప సినిమాలు అనేక కారణాల చేత థియేటర్స్ లో సరిగా ఆడవు. విడుదలకు ముందు ఆడియన్స్ ని ప్రమోషనల్ కంటెంట్ తో ఆకర్షించలేకపోవడం అందుకు ప్రధాన కారణం. ఈ కాలం లో స్టార్ హీరోకి అయినా సరే విడుదలకు ముందు ప్రమోషనల్ కంటెంట్ అదిరిపోవాలి. లేకపోతే ఓపెనింగ్స్ రావడం లేదు. ఇక చిన్న సినిమాల పరిస్థితి ని మీరే అర్థం చేసుకోండి. అలా విడుదలకు ముందు ఆడియన్స్ లో ఎలాంటి ఆసక్తి క్రియేట్ చేయకుండా థియేటర్స్ లోకి వచ్చి ఫ్లాప్ అయిన చిన్న చిత్రం ‘8 వసంతాలు'(8 Vasanthaalu). ఫణింద్ర నరిశెట్టి(Phanindra Narisetty) దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ‘మ్యాడ్’ ఫేమ్ అనంతిక(Ananthika sanilkumar) ఇందులో హీరోయిన్ గా నటించింది. ఒక విధంగా చెప్పాలంటే ఆమెనే ఈ చిత్రానికి హీరో అనుకోవచ్చు. థియేటర్స్ లో సరిగా ఆడని ఈ చిత్రాన్ని రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు.
Also Read: పవన్ కళ్యాణ్ ఓవర్సీస్ ఫ్యాన్స్ కి చేదువార్త.. నిర్మాత AM రత్నం మామూలోడు కాదు!
ఆడియన్స్ నుండి రెస్పాన్స్ అద్భుతంగా వచ్చింది. అసలు సినిమాటోగ్రఫీ ఎంత అద్భుతంగా ఉంది. ప్రతీ ఫ్రేమ్ స్క్రీన్ పై ఒక అందమైన పెయింటింగ్ లాగా అనిపిస్తుంది అంటూ సోషల్ మీడియా లో ఈ సినిమాని చూసిన నెటిజెన్స్ కామెంట్స్ చేశారు. డైలాగ్స్ కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయని, ఒక అందమైన నవలకి ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో, అంత అద్భుతంగా ఈ సినిమా ఉందని, ఇలాంటి చిత్రాలను ఆదరించలేకపోవడం నిజంగా ఆడియన్స్ తప్పు అని నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు చెప్తున్న మాట. అలా నెట్ ఫ్లిక్స్ నుండి ఈ చిత్రానికి అద్భుతమైన పాజిటివ్ టాక్ రావడంతో ఈ చిత్రాన్ని ఆడియన్స్ ఎగబడి మరీ చూశారు. రెస్పాన్స్ అదిరిపోయింది. గత వారం ఓటీటీ లో విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలను కూడా వెనక్కి నెట్టి ఈ చిత్రం టాప్ లో ట్రెండ్ అవుతుంది.
Also Read: ఇక సెలవు..యాంకర్ రష్మీ సంచలన నిర్ణయం..దుమారం రేపుతున్న పోస్ట్!
ఒక చిన్న సినిమాకు ఇది చాలా పెద్ద విషయమే. విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు 100 మిలియన్ కి పైగా వాచ్ మినిట్స్ వచ్చాయి. రాబోయే రోజుల్లో ఈ చిత్రం అత్యధిక వారాలు ట్రెండ్ అయిన అతి కొద్ది తెలుగు సినిమాల్లో ఇది కూడా ఒకటి అని అనిపించుకునే రేంజ్ కి కచ్చితంగా వస్తుందని అంటున్నారు. ఎందుకంటే ఇలాంటి సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు. అంతే కాకుండా ఇలాంటి తరహా క్లీన్ సినిమాలను ఇష్టపడే యూత్ ఆడియన్స్ సంఖ్య కూడా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువ. అందుకే ఈ చిత్ర రాబోయే రోజుల్లో ఓటీటీ లో చరిత్ర సృష్టిస్తుందని, అందులో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.