Ram Charan latest update: ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram charan) బుచ్చి బాబు(Buchi Babu Sana) దర్శకత్వం లో ‘పెద్ది'(Peddi Movie) అనే చిత్రం చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఏప్రిల్ నెలలో ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో ని చేయగా, అది పాన్ ఇండియన్ లెవెల్ లో సంచలనం సృష్టించింది. అంతర్జాతీయ క్రికెటర్స్ కూడా పెద్ది సిగ్నేచర్ షాట్ ని అనుసరిస్తూ ఎన్నో వీడియోలు చేశారు. నిజానికి క్రికెట్ లో అలాంటి షాట్స్ ఆడడం అంత తేలికైన విషయం కాదు. అందుకే స్పూఫ్ వీడియోస్ తో IPL టైం లో అదరగొట్టేశారు. ఇందులో రామ్ చరణ్ కేవలం క్రికెటర్ గా మాత్రమే కాదు, అన్ని రకాల ఆటల్లో ప్రావిణ్యం ఉన్న టాలెంటెడ్ కుర్రాడిగా నటించబోతున్నాడు. ఆయనకు గురువుగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్నాడు. రీసెంట్ గా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు.
Also Read: చివరి చిత్రంపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన..!
శరవేగంగా విరామం లేకుండా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ చిత్రం, గత కొంతకాలంగా ఆగిపోయింది. ఎందుకంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కుస్తీ ఫైటింగ్ కి ధీటుగా తన శరీర ఆకృతిని మార్చుకుంటున్నాడు. అందుకోసం ఆయన వర్కౌట్స్ చేస్తున్న సమయం లో డైరెక్టర్ బుచ్చి బాబు ఒక ఫోటో తీసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేసాడు. అది బాగా వైరల్ అయిపోయింది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు దొరికితే రామ్ చరణ్ ఎలా నటిస్తాడో, ఆయన నట విశ్వరూపం ఏ రేంజ్ లో ఉంటుందో గతంలో మనం ఎన్నో సినిమాల్లో చూసాము. ‘గేమ్ చేంజర్’ చిత్రం కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా, ఆ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ నటన అందరినీ కట్టిపారేసింది. ఆయన ఆ పాత్రలో నటించలేదు. జీవించాడు అని చెప్పొచ్చు.
Also Read: ‘నీ ఒడిలో తలవాల్చుకొని ఏడవాలని ఉంది’.. బ్రహ్మానందం మాటలకు నవ్వు ఆపుకోలేకపోయి పవన్
ఇకపోతే ఈ సినిమా విజయనగరం లోని ఒక గ్రామం నేపథ్యం లో తెరకెక్కుతుంది. ముందుగా మేకర్స్ అక్కడికి వెళ్లి షూటింగ్ చెయ్యాలని అనుకున్నారు. కానీ ప్రాక్టికల్ గా అది వర్కౌట్ అవ్వకపోవడం తో హైదరాబాద్ లోనే ఒక స్థలాన్ని కొనుగోలు చేసి, 5 కోట్ల రూపాయలతో ఆ గ్రామానికి సంబంధించిన సెట్స్ ని వేశారట. అంటే కృతిమంగా ఒక గ్రామాన్నే నిర్మించేశారు. డైరెక్టర్ బుచ్చి బాబు మరియు ఆయన టీం, విజయనగరం లో ఉన్న ఆ నిజమైన గ్రామాన్ని రెండు మూడు రోజుల పాటు పూర్తిగా పరిశీలించి, కొలతలు తీసుకొని మరీ ఈ గ్రామాన్ని నిర్మించారట. త్వరలోనే ఇక్కడ షూటింగ్ కార్యక్రమాలు జరగనుంది. ఈ ఏడాది చివరి లోపు సినిమా మొత్తాన్ని పూర్తి చేసి, వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చ్ 27 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల చెయ్యాలని చూస్తున్నారు.