Mollywood : మాలీవుడ్ లో మహిళలపై లైంగిక వేధింపులు.. హేమా కమిటీ నివేదిక తేల్చిందిదే..!

మలయాళ చిత్ర పరిశ్రమ (మాలీవుడ్) మహిళలపై వేధింపులు అధికంగా ఉన్నాయని కేరళ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన ఒక కమిటీ నిర్వహించిన ఒక సర్వేలో బయట పడింది. ఈ నివేదికపై మాలీవుడ్ తో పాటు పలు ఇండస్ట్రీలు విమర్శలు ఎదుర్కొంటున్నాయి.

Written By: NARESH, Updated On : August 20, 2024 3:03 pm

Hema Committe Report

Follow us on

Mollywood : మలయాళ సినిమారంగంలో మహిళలపై వేధింపులు, లింగ అసమానతలు అధ్యయనం చేయడానికి 2017లో ఓ నటిపై నటుడు దిలీప్ దాడి జరిగిన తర్వాత కేరళ ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఇక కమిటీ నివేదిక కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులు, దోపిడీలు, అసభ్యంగా ప్రవర్తించడం వంటి వాటిని క్రిమినల్ గ్యాంగ్ నియంత్రిస్తోందని పేర్కొంది. లొంగని మహిళలను చిత్రపరిశ్రమలోఉండనివ్వరు అంటూ తెలిపింది. కొంత మంది నిర్మాతలు, దర్శకులు, నటులు, ప్రొడక్షన్ కంట్రోలర్ తో కూడిన పవర్ చట్రంలో సినిమా రంగం ఉందని చెప్పారు. 2017లో ఓ నటిపై నటుడు దిలీప్ దాడి ఘటన అనంతరం నియమించిన ఈ కమిటీ తన నివేదికను నాడు అందజేసింది. జస్టిస్ హేమ ఆధ్వర్యంలో ఈ కమిటీ తన రిపోర్టును ఇచ్చింది. ఈ కమిటీ నివేదిక ప్రకారం.. చిత్ర పరిశ్రమలో చాలా మంది మహిళలు లైంగిక దోపిడికి గురవుతున్నారు. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాలంటేనే ఇబ్బందికర పరిస్థితులు వారికి ఎదురవుతున్నాయి. ఇక వారి ఆగడాలకు లొంగే వారికి ప్రత్యేక కోడ్ నేమ్ లతో పిలుస్తారని, లొంగని వారికి చిత్ర పరిశ్రమలో అవకాశాలు ఉండవని నివేదికలో పేర్కొంది. చిత్రరంగంలో మహిళల యొక్క భద్రతపై ఈ కమిటీ తీవ్ర ఆందోళనను వ్యక్తపరిచింది. సినీ పరిశ్రమలో పెద్ద మనుషులుగా చలామణి అయ్యే కొందరు దర్శకులు, నిర్మాతలు, హీరోలు అతి దారుణంగా వ్యవహరిస్తున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని రిపోర్ట్ ఇచ్చారు.

ఆర్టీఐ ద్వారా బహిర్గతం
కాగా, ఐదేళ్ల క్రితమే ఈ కమిటీ నివేదిక ఇచ్చింది. నాటి నుంచి రహస్యంగా ఉంచారు. తాజాగా ఆర్టీఐ ద్వారా ఈ నివేదిక వెల్లడైంది. మత్తులో తూగే కొందరు నటులు, చిత్ర రంగానికి చెందిన వారు మహిళా నటుల గదుల తలుపులు రాత్రివేళల్లో కొట్టేవారని చెప్పుకొచ్చారు. లైంగిక వేధింపులకు గురైన ఎంతో మంది నటీమణులు, జూనియర్ ఆర్టిస్టులు, కిందిస్థాయి సిబ్బంది బయటకు చెప్పుకోలేకపోయారని, కనీసం పోలీసులను సంప్రదించే పరిస్థితి కూడా లేకపోయిందని చెప్పారు.

ఈ కమిటీ నివేదిక ఇలా వెల్లడించింది.. ‘మెరుస్తున్న నక్షత్రాలు, అందమైన చంద్రుడితో ఆకాశంలో ఎన్నో రహస్యాలు ఉంటాయని, కానీ శాస్ర్తీయ పరిశోధనల్లో నక్షత్రాలు మెరిసిపోవు.. చంద్రుడు మిణుకు మిణుకు మంటూ ఉంటాడు.. అందంగా కనిపిస్తుంది అంతే.. అంటూ నివేదిక పేర్కొంది. మీరు చూసే వాటిని నమ్మొద్దు..చక్కెరలా కనిపిస్తుంది.. కానీ కాదు అంటూ చెప్పారు.

కమిటీ నివేదికలో కీలక అంశాలు..
ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం.. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై వేధింపులు తీవ్రంగా ఉన్నాయి.. కనీసం దగ్గరి బంధువులకు కూడా చెప్పుకునే పరిస్థితిలో మహిళలు లేరు. కొందరు మహిళలు రహస్యంగా తమతో షేర్ చేసుకున్న వివరాలు విని తామంతా షాక్ కు గురయ్యామని కమిటీ పేర్కొంది. సినిమాల్లో నటించడానికి, మరే ఉద్యోగం అయినా చేయడానికి ఈ రంగంలోకి రావాలంటే మహిళలు కొంత అడ్జస్ట్ కావాల్సి ఉంటుంది.

పైవారి లైంగిక డిమాండ్లకు నో చెప్పే పరిస్థితి ఉండదు. సినిమా షూటింగ్ ల సమయంలో తాము బస చేసే హోటళ్లు, ఇతర గదుల్లో వీరి వేధిపుంలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కోసారి కొడుతారు కూడా. రాత్రివేళల్లో పదేపదే తలుపులు తడుతారు. మాట్లాడుకుందాం.. అంటూ మాటలు కలిపి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తారు. మర్యాద లేని ప్రవర్తనతో ఇబ్బంది పెడుతారని ఈ సందర్భంగా కమిటీ తన నివేదికలో వెల్లడించినట్లు బహిర్గతమైంది.