https://oktelugu.com/

Yuvraj Singh Biopic : లెజెండ్ క్రికెటర్ బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్..పాన్ ఇండియా రేంజ్ లో ఒక్క రికార్డు కూడా మిగలదు!

యువరాజ్ సింగ్ క్రికెట్ జర్నీ కి సంబంధించిన పూర్తి వివరాలను గత రెండేళ్లుగా వీళ్ళు పరిశీలించి స్క్రిప్ట్ తయారు చేయించారట. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదురుకొని అల్ రౌండర్ గా నిలిచి, మన భారత దేశానికీ ప్రపంచ కప్ ని తీసుకొని రావడంలో ప్రధాన భూమిక పోషించడం, ఆ తర్వాత ఆయనకి క్యాన్సర్ రావడం వంటి అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : August 20, 2024 / 03:11 PM IST

    Yuvraj Singh Biopic

    Follow us on

    Yuvraj Singh Biopic : మన ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై బయోపిక్స్ సందడి చాలా కాలం నుండి ఉంది. దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో రాణించిన గొప్పవారి జీవితచరిత్రని చూసేందుకు ప్రతీ ఒక్కరికి ఆసక్తిగానే ఉంటుంది. అయితే కెరీర్ లో ఎక్కువ శాతం ఒడిదుడుగులను ఎదురుకున్న లెజెండ్స్ బియోపిక్స్ కి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఉదాహరణకి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మహానటిగా ఒక వెలుగువెలిగిన సావిత్రి చివరి రోజుల్లో ఎన్నో ఇబ్బందులకు గురై చనిపోయింది. ఆమె జీవిత కథని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ‘మహానటి’ అనే చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేష్ ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది.

    అలాగే ఇండియా కి రెండు సార్లు వరల్డ్ కప్ తీసుకొచ్చిన ‘మహేంద్ర సింగ్ ధోని’ బయోపిక్ కూడా భారీ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు మరో క్రికెట్ లెజెండ్ యువరాజ్ సింగ్ బయోపిక్ తెరకెక్కబోతుంది. ఈ బయోపిక్ కి సంబంధించిన అధికారిక ప్రకటన కాసేపటి క్రితమే వచ్చింది. భూషణ్ కుమార్, రవి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. యువరాజ్ సింగ్ క్రికెట్ జర్నీ కి సంబంధించిన పూర్తి వివరాలను గత రెండేళ్లుగా వీళ్ళు పరిశీలించి స్క్రిప్ట్ తయారు చేయించారట. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదురుకొని అల్ రౌండర్ గా నిలిచి, మన భారత దేశానికీ ప్రపంచ కప్ ని తీసుకొని రావడంలో ప్రధాన భూమిక పోషించడం, ఆ తర్వాత ఆయనకి క్యాన్సర్ రావడం వంటి అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇంకా అధికారికంగా బయటపెట్టలేదు కానీ, ఇందులో యువరాజ్ సింగ్ పాత్ర కోసం నిర్మాతలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట.

    త్వరలోనే హైదరాబాద్ లో ఉండే ఎన్టీఆర్ ని కలిసి, ఈ బయోపిక్ పై చర్చలు జరపనున్నారట. యువరాజ్ సింగ్ లాంటి లెజెండ్ బయోపిక్ ని ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు చేస్తేనే న్యాయం చేయగలరని, ఆయన జీవిత చరిత్ర కేవలం ఒక్క భాషకి మాత్రమే పరిమితం కాకూడదు అంటే ఎన్టీఆర్ తోమే చెయ్యాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ఒప్పుకొని చేస్తే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ కి హద్దులు అనేవే ఉండవు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ అనేది ప్రస్తుతం ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ బెంచ్ మార్క్. ఒకవేళ ఈ సినిమా ఎన్టీఆర్ చేస్తే రెండు వేల కోట్ల రూపాయిల గ్రాస్ వస్తుందని బలమైన నమ్మకం తో ఉన్నారు ఆయన అభిమానులు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు మరో రెండు నెలల్లో అధికారికంగా బయటకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలను ఏర్పాటు చేసిన ఈ సినిమా వచ్చే నెల 27 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.