Hanu Raghavapudi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఒకరు…’అందాల రాక్షసి’ (Andala Rakshashi) సినిమా పెద్దగా సక్సెస్ ని సాధించనప్పటికి ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. అయితే ఈ సినిమాలో సాంగ్స్ అద్భుతంగా ఉండటమే కాకుండా అతను ఒక మంచి టేస్ట్ ఉన్న దర్శకుడిగా తనకి మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన సినిమాలు హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా పాటలు మాత్రం మంచి గుర్తింపును సంపాదించుకున్నాయి. ఇక సీతారామం (Seetharamam) సినిమాతో ఆయన భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలో ఉన్న ప్రతి సాంగ్ చాలా సూపర్ గా ఉంటాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా అద్భుతమైన పాటలు ఉంటాయంటూ ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. నిజానికి హను రాఘవపూడి సినిమాలో పాటలు అద్భుతంగా రావడానికి గల కారణం ఏంటి అంటే ఆయన ఎక్కువగా లవ్ స్టోరీలను కథలుగా ఎంచుకొని సినిమాలు చేస్తూ ఉంటాడు.
Also Read: హిట్ మూవీ కొత్త పోస్టర్ మామూలుగా లేదుగా…నాని అరాచకం అంతే..?
కాబట్టి స్టోరీ రాసుకున్నప్పుడే ఆయన సిచువేషన్ కు తగ్గట్టుగా ఎలాంటి పాటైతే బాగుంటుంది. అక్కడ ఎలాంటి ట్యూన్ వస్తే సాంగ్ ప్రేక్షకుడిని మెప్పిస్తోంది అనేది ఆయన మైండ్ లో ముందుగానే ఫీడ్ అయిపోతుందట. దానివల్ల మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చున్నప్పుడు ఆ సాంగ్ ని ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటున్నట్టుగా ఆయన తెలియజేశాడు.
అందువల్లే ఆయన సినిమాల్లోని పాటలకు మంచి గుర్తింపైతే లభిస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా హను రాఘవపూడి లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోయే సినిమాలో మరొక ఎత్తుగా మారబోతున్నాయి…
ఇక ప్రభాస్ తో భారీ విజయాన్ని అందుకొని స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోవాలని చూస్తున్నాడు. పాన్ ఇండియాలో సైతం అతనికి ఇప్పటివరకు మంచి సక్సెస్ అయితే దక్కలేదు. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు సాగే ప్రయత్నమైతే చేస్తున్నాడు…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు తద్వారా ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకోబోతున్నాడు అనేది…