Gopichand Malineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంది. వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా భారీ సక్సెస్ లను సాధిస్తూ భారీ కలెక్షన్లను కూడా కొల్లగొడుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో గోపీచంద్ మలినేని లాంటి దర్శకుడు ప్రస్తుతం జాట్ (Jaat) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అయిన సన్ని డియోల్ ను హీరోగా పెట్టి చేసిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. ముఖ్యంగా ఆయన డైరెక్షన్ బావుందంటూ చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆయన ఇప్పుడు బాలయ్య బాబుతో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కానీ ఇంతకుముందు బాలయ్య బాబుతో వీరసింహారెడ్డి (Veerasimha Reddy) అనే సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఆ సినిమాను మించి మరో సినిమా చేసి భారీ విజయాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య (Balayya) అఖండ 2 (Akhanda 2) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని తో సినిమా చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇప్పటివరకు బాలయ్య బాబు మరొక సినిమాకు అయితే కమిట్ అవ్వలేదు. కాబట్టి ఈ సినిమాతో తనకు సక్సెస్ ఇచ్చిన దర్శకుడుని మరోసారి రిపీట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: హిట్ మూవీ కొత్త పోస్టర్ మామూలుగా లేదుగా…నాని అరాచకం అంతే..?
మరి వీరసింహా రెడ్డి సినిమాతో భారీ విజయాన్ని అందించిన గోపీచంద్ మలినేని ఇకమీదట చేయబోయే సినిమాలతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు తద్వారా ఆయన కంటూ ఎలాంటి గుర్తింపును సంపాదించుకోబోతున్నాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక తన ఎంటైర్ కెరియర్ లో రవితేజతో మూడు సినిమాలను చేశాడు. ఇక బాలయ్య బాబు తో ఒక సినిమా చేశాడు. ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకున్న బాలయ్య బాబు అభిమానులు కూడా చాలా వరకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే బాలయ్య బాబుతో ఆయన ఒక పొలిటికల్ డ్రామాని తెరకెక్కించే పనిలో ఉన్నారట.
మరి దానికి సంబంధించిన కథ ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా గోపి చంద్ సినిమాల్లో బి,సి సెంటర్ ప్రేక్షకులకు కావలసిన ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆయన కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా స్టార్ హీరోల నుంచి కూడా అవకాశాలను అందుకుంటున్నాడు…