https://oktelugu.com/

ఐటమ్ సాంగ్ ను సమర్థిస్తున్న మరో హీరోయిన్ !

ఒక్కోసారి హీరోయిన్ రేంజ్ గ్లామర్ ఉన్నా.. హీరోయిన్ ఛాన్స్ లు రావు. అలా హీరోయిన్ గా అవకాశాలు రాక కొంతమంది, ఐటమ్ సాంగ్స్ కి రెడీ అవుతారు. అలాగే ఒక్కొక్కసారి బాగా డబ్బులొచ్చే సందర్భంలో కూడా స్వయంగా హీరోయిన్సే ఐటెమ్ సాంగ్స్ చేస్తుంటారు. పైగా ఐటమ్ సాంగ్ అందుకే చేశాను, ఇందుకే చేశాను అంటూ సమర్థించుకోవడానికి మన హీరోయిన్స్ పడే పాట్లు గురించి వింటూనే ఉన్నాం. డాన్స్ చేయడానికి బాగా స్కోప్ ఉందని ఐటమ్ సాంగ్ ఒప్పుకున్నానని […]

Written By:
  • admin
  • , Updated On : August 23, 2020 / 06:27 PM IST
    Follow us on


    ఒక్కోసారి హీరోయిన్ రేంజ్ గ్లామర్ ఉన్నా.. హీరోయిన్ ఛాన్స్ లు రావు. అలా హీరోయిన్ గా అవకాశాలు రాక కొంతమంది, ఐటమ్ సాంగ్స్ కి రెడీ అవుతారు. అలాగే ఒక్కొక్కసారి బాగా డబ్బులొచ్చే సందర్భంలో కూడా స్వయంగా హీరోయిన్సే ఐటెమ్ సాంగ్స్ చేస్తుంటారు. పైగా ఐటమ్ సాంగ్ అందుకే చేశాను, ఇందుకే చేశాను అంటూ సమర్థించుకోవడానికి మన హీరోయిన్స్ పడే పాట్లు గురించి వింటూనే ఉన్నాం. డాన్స్ చేయడానికి బాగా స్కోప్ ఉందని ఐటమ్ సాంగ్ ఒప్పుకున్నానని ఈ ఒక్క రిజనే.. తమన్నా దగ్గర నుండి కాజల్ దాకా అందరూ చెప్పి ఉంటారు.

    Also Read: తనకు ప్రభాస్‌ హీరోయినే కావాలంటున్న బన్నీ?

    ఇప్పుడీ ఈ లిస్ట్ లోకి హన్సిక కూడా చేరిపోయింది. హీరోయిన్ గా తనకొచ్చే రోల్స్ లోనే హన్సిక సరిగ్గా న్యాయం చేయదనే టాక్ ఉంది. అలాంటి హీరోయిన్ ఇప్పుడు ఐటమ్ సాంగ్ కి న్యాయం చేయడానికి రెడీ అవుతోంది. నిజానికి హన్సికకి ఇప్పటికీ హీరోయిన్ గా చాలా ఆఫర్లు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. అయితే ఆ సినిమాల్లో తన పాత్రలకు డాన్స్ చేయడానికి పెద్దగా స్కోప్ లేదట. అందుకే స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకున్నానని, నాకు మ్యూజిక్, డాన్స్ అంటే చాలా ఇష్టమని.. అందుకే స్పెషల్ సాంగ్ చేస్తున్నానని చెబుతుంది హన్సిక.

    Also Read: ఎంఎంఏ ఫైటర్గా విజయ్‌ దేవరకొండ!

    ఇలా మొత్తానికి హన్సిక కూడా ఐటమ్ సాంగ్ చేయడాన్ని సమర్థించుకుంటుంది. ఈ లాక్ డౌన్ టైమ్ లో పూర్తిగా ఇంటికే పరిమితమైపోయిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం డాన్స్ బాగా ప్రాక్టిస్ చేస్తోందట. ఇంతకీ హన్సిక ఐటమ్ సాంగ్ చేయబోయే సినిమా రవితేజది. రవితేజ హీరోగా రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన కథతో, ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రానున్న సినిమాలో హన్సిక ఒక స్పెషల్ సాంగ్ చేయబోతుంది.

    Tags