https://oktelugu.com/

తనకు ప్రభాస్‌ హీరోయినే కావాలంటున్న బన్నీ?

శ్రద్దా కపూర్. బాలీవుడ్‌లో మంచి డిమాండ్‌ ఉన్న యువ నటి. కపూర్ ఫ్యామిలీ నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది. పదేళ్ల కింద వచ్చిన ‘తీన్‌ పత్తీ’తో వెండితెరకు పరిచయం అయిన శ్రద్దా.. ‘ఆషికీ2’, ఏబీసీడీ2, భాగీ, ఓకే జాను, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్‌, స్త్రీ, చిచోరే వంటి విజయవంతమైన సినిమాల్లో నటించి నటిగా నిలదొక్కుకుంది. గతేడాది వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘సాహో’తో టాలీవుడ్‌కు కూడా పరిచయం అయిందామె. ప్రభాస్‌ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 23, 2020 / 06:15 PM IST
    Follow us on


    శ్రద్దా కపూర్. బాలీవుడ్‌లో మంచి డిమాండ్‌ ఉన్న యువ నటి. కపూర్ ఫ్యామిలీ నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది. పదేళ్ల కింద వచ్చిన ‘తీన్‌ పత్తీ’తో వెండితెరకు పరిచయం అయిన శ్రద్దా.. ‘ఆషికీ2’, ఏబీసీడీ2, భాగీ, ఓకే జాను, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్‌, స్త్రీ, చిచోరే వంటి విజయవంతమైన సినిమాల్లో నటించి నటిగా నిలదొక్కుకుంది. గతేడాది వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘సాహో’తో టాలీవుడ్‌కు కూడా పరిచయం అయిందామె. ప్రభాస్‌ సరసన తన అందచందాలతో ఆకట్టుకున్న శ్రద్ధ పేరే ఈ మధ్య టాలీవుడ్‌లో తరచుగా వినిపిస్తోంది. సుకుమార్ అల్లు అర్జున్‌ కాంబినేషన్లో వస్తున్న ‘పుష్ప’ సినిమాలో ఐటమ్‌ సాంగ్‌లో ఆమె నర్తిస్తుందన్న వార్తలు వచ్చాయి.

    Also Read: చైతు ‘లవ్ స్టోరీ’కి 40 కోట్లు !

    బన్నీ- సుక్కూ మూవీ అంటే అందులో ప్రత్యేక పాట ఖాయం. అంచనాలకు తగ్గట్టే పుష్పలో కూడా ఈ పాట ను అద్భుతంగా తీయాలని సుక్కూ భావిస్తున్నాడట. ఇది పాన్‌ ఇండియా మూవీ కాబట్టి బన్నీ రేంజ్‌కు, అతని డ్యాన్స్‌ స్పీడును శ్రద్ధా కపూర్ అయితేనే మ్యాచ్‌ చేస్తుందని భావించాడట. ఇందుకోసం శ్రద్ధను సంప్రదించాడని సమాచారం. ఆమె ఒప్పుకుంటే మూవీ హిందీ మార్కెట్‌కు కూడా బాగా ఉపయోగపడుతుందని చిత్ర బృందం భావిస్తుందట.

    Also Read: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ ఎప్పుడంటే…

    అయితే, దీనిపై ఇంకా స్పష్టత రాలేదు కానీ… బన్నీ మరో సినిమాలో ఈ బాలీవుడ్‌ యువ నటి హీరోయిన్‌గా నటించే అవకాశం కనిపిస్తోంది. మరో టాప్‌ డైరెక్టర్ కొరటాల శివతో అల్లు అర్జున్‌ ఓ సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే అధికారికంగా ప్రకటించారు. బన్నీ.. పుష్ప, కొరటాల.. ఆచార్య చిత్రీకరణ పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్‌ కోసం అన్వేషణ జరుగుతోంది. అయితే, అల్లు అర్జున్‌ మాత్రం తన చాయిస్‌ శ్రద్ధా కపూర్ అంటున్నాడట. ఆమెనే హీరోయిన్‌గా తీసుకోవాలని కొరటాలపై ఒత్తిడి తెస్తున్నాడట. ఇదే నిజమైతే మరో మంచి కాంబినేషన్‌ సెట్‌ కానుంది. నటనతో పాటు డ్యాన్స్‌లోనూ శ్రద్ధా ఇరగదీస్తుంది. ఒకవేళ మరో తెలుగు సినిమాకు ఆమె ఓకే అంటే మాత్రం బన్నీ అభిమానులకు పండగే.