https://oktelugu.com/

పాత కలకత్తాలో సాయి పల్లవి విలన్ !

నేచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో రాబోతున్న ‘శ్యామ్ సింఘ రాయ్’ సినిమా పై సినిమా జనాల్లో కూడా బాగా ఆసక్తి ఉంది. సహజంగా సినిమా జనాలకి, ఒక సినిమా పై ఆసక్తి బాగా పెరిగింది అంటే… ఆ సినిమాలో ఏదో ప్రత్యేకత ఉండి ఉండాలి. అవును ‘శ్యామ్ సింఘ రాయ్’కి ఆ ప్రత్యేకత ఉంది. ‘శ్యామ్ సింఘ రాయ్’లో పాతకాలం కలకత్తాను ప్రధానంగా హైలైట్ చేస్తూ చూపించడానికి మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ […]

Written By:
  • admin
  • , Updated On : August 23, 2020 / 06:39 PM IST
    Follow us on


    నేచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో రాబోతున్న ‘శ్యామ్ సింఘ రాయ్’ సినిమా పై సినిమా జనాల్లో కూడా బాగా ఆసక్తి ఉంది. సహజంగా సినిమా జనాలకి, ఒక సినిమా పై ఆసక్తి బాగా పెరిగింది అంటే… ఆ సినిమాలో ఏదో ప్రత్యేకత ఉండి ఉండాలి. అవును ‘శ్యామ్ సింఘ రాయ్’కి ఆ ప్రత్యేకత ఉంది. ‘శ్యామ్ సింఘ రాయ్’లో పాతకాలం కలకత్తాను ప్రధానంగా హైలైట్ చేస్తూ చూపించడానికి మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

    Also Read: తనకు ప్రభాస్‌ హీరోయినే కావాలంటున్న బన్నీ?

    ‘శ్యామ్ సింఘ రాయ్’ సినిమా కథే కాస్త ఫాంటసీ మిక్స్ అయి, ఎమోషనల్ గా సాగే పక్కా ఫిక్షనల్ డ్రామాగా సినిమా వుంటుందని.. అందుకే పూర్తిగా పాత కలకత్తా లుక్ కావాల్సి వుందని తెలుస్తోంది. కలకత్తా వెళ్లినా పాత లుక్ వుండదు కాబట్టి, ఇక్కడే పాతతరం కలకత్తా లుక్ వచ్చేలా సెట్ డిజైన్స్ చేయించారు. ఆ మధ్య హైదరాబాద్ లోని ఖాళీగా ఉంటున్న అల్యుమినియమ్ ఫ్యాక్టరీలో సెట్ వేయడం కూడా మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ సెట్ మరో ఇరవై రోజుల్లో పూర్తి అవుతుందని.. సెట్ పూర్తయ్యాక ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు అవుతుందని తెలుస్తోంది.

    ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం క్రేజీ బ్యూటీ సాయి పల్లవిని తీసుకోబోతున్నారు. అయితే సాయి పల్లవి నెగటివ్ రోల్ లో కనిపించబోతుందట. నిజంగా సాయి పల్లవి లాంటి నటి నెగిటివ్ రోల్ అంటే మొత్తానికి సినిమాలో ఏదో కొత్త కంటెంట్ ఉందనే ఫీలింగ్ కూడా జనంలో బాగా క్రియేట్ అవుతుంది. ఏమైనా సాయి పల్లవి క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో వినూత్నంగా ఉండబోతుందట.

    Also Read: ఎంఎంఏ ఫైటర్గా విజయ్‌ దేవరకొండ!

    నాని మొదటి నుండి ప్రేక్షకులకు కాస్త వైవిధ్యమైన కథలు చెప్పడానికి.. మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ తన సినిమాలో ఏదో మ్యాజిక్ ఉంటుందనే నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నాడు. అందుకే మన రచయితలూ, దర్శకులు కూడా నాని కోసం కాస్త కొత్తగా ఆలోచిస్తున్నారు. ల్ సాంగ్ చేయబోతుంది.