Homeఎంటర్టైన్మెంట్Tamannaah Bhatia: తమన్నా లవర్ నేను, విజయ్ వర్మ నన్ను మోసం చేశాడు... తెరపైకి మరో...

Tamannaah Bhatia: తమన్నా లవర్ నేను, విజయ్ వర్మ నన్ను మోసం చేశాడు… తెరపైకి మరో లవ్ స్టోరీ!

Tamannaah Bhatia: తమన్నా పరిశ్రమకు వచ్చి దాదాపు 20 ఏళ్ళు. టాలీవుడ్ లో తిరుగులేని స్టార్డం అనుభవించిన నటి ఆమె. ఇన్నేళ్ల కెరీర్లో చాలా రూమర్స్ వచ్చాయి. పలువురితో డేటింగ్ చేశారన్న వాదనలు ఉన్నాయి. అయితే ఎవరితో తమన్నా పర్మినెంట్ గా లేదు. అలాగే ప్రచారమైన వార్తల్లో నిజమెంతో తెలియదు. తమన్నా కెరీర్ ప్రస్తుతం నెమ్మదించింది. ఆమెకు ఆఫర్స్ వస్తున్నప్పటికీ ఒకప్పటి జోరు లేదు. సీనియర్ హీరోల పక్కన ఛాన్స్ లు అందుకుంటుంది. ఎన్టీఆర్, మహేష్, పవన్ కళ్యాణ్, చరణ్ వంటి టాప్ స్టార్స్ ఎప్పుడో పక్కన పెట్టేశారు.

దీంతో పెళ్లి వార్తలు తెరపైకి వస్తున్నాయి. తమన్నా వివాహం చేసుకోబోతున్నారంటూ పలుమార్లు వినిపించింది. ఈ వార్తలను తమన్నా ఖండించారు. అందుకు ఇంకా సమయం ఉందని వివరణ ఇచ్చారు. గత ఆరు నెలలుగా తమన్నా నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. పలుమార్లు ఇద్దరూ కలిసి కనిపించారు. ప్రైవేట్ పార్టీల్లో జంటగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి. న్యూ ఇయర్ వేడుకలు కూడా కలిసి చేసుకున్నారట. విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో పడ్డారన్నది నిజం. అందుకే ఆమె ప్రవర్తన రుజువు అంటూ పలువురు భావిస్తున్నారు.

ఎప్పటిలాగే విజయ్ వర్మతో ఎఫైర్ రూమర్స్ ని తమన్నా ఖండించారు. నేను సింగిల్, ఎవరితో డేటింగ్ చేయడం లేదంటూ వివరణ ఇచ్చారు. రూమర్స్ ని ఖండించి నెల రోజులు కాకుండానే మరోసారి ఆయనతో డిన్నర్ డేట్ కి వెళుతూ మీడియాకు దొరికింది. ఇటీవల ఒకే కారులో డ్రైవర్ లేకుండా విహరిస్తున్న ఈ జంట మీడియాకు చిక్కారు. ఈ క్రమంలో తమన్నా బండారం బహిర్గతం అయ్యింది.

తమన్నా-విజయ్ వర్మ బంధం మీద జనాలు తలలు బద్దలు కొట్టుకుంటుంటే… మధ్య మరో బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య ఎంటర్ అయ్యారు. తమన్నా నాది, ఆమెతో నువ్వు తిరుగుతున్నావా? అని పబ్లిక్ పోస్ట్ పెట్టాడు. విజయ్ వర్మ నటించిన లేటెస్ట్ సిరీస్ ట్రైలర్ మే 3న విడుదల కానుంది. దీనికి సంబంధించిన ప్రమోషనల్ వీడియో విజయ్ వర్మ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ కి కామెంట్ గా ‘నా తమన్నాతో నువ్వు సన్నిహితంగా ఉంటున్నావా. విజయ్ వర్మ నాకు గట్టి దెబ్బ వేశావ్. నా పరువు తీయలేదు అంత వరకు సంతోషం… దేవుడా’ అని కామెంట్ పెట్టాడు. గుల్షన్ దేవయ్య కామెంట్ తమన్నా, విజయ్ వర్మ రిలేషన్ ధృవీకరిస్తోంది. అదే సమయంలో తమన్నా నాది, నాతో కూడా రిలేషన్ నడిపిందని చెప్పినట్లుగా ఉంది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version