Chikiri Chikiri Song: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటించిన ‘పెద్ది'(Peddi Movie) చిత్రం లోని ‘చికిరి..చికిరి’ పాత రీసెంట్ గానే విడుదలై గ్లోబల్ వైడ్ గా ఎంతటి సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మొదట్లో ఈ పాటకు సంబంధించిన ప్రోమో విడుదలైనప్పుడు సోషల్ మీడియా లో నెటిజెన్స్ విపరీతంగా ట్రోల్ చేశారు. రామ్ చరణ్ లాంటి డ్యాన్సర్ తో ఇలాంటి స్టెప్పులు వెయ్యిస్తారా అంటూ తిట్టారు. కానీ పూర్తి పాట వచ్చిన తర్వాత అందులోని స్టెప్పులను దేశవ్యాప్తంగా ఉన్న మ్యూజిక్ లవర్స్ అందరూ ఒక రేంజ్ లో ఎంజాయ్ చేశారు. చికిరి చికిరి పాటకు స్టెప్పులేస్తూ ఇన్ స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ షార్ట్స్ లో వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో ఈ పాటకు దాదాపుగా మూడు లక్షలకు పైగా రీల్స్ వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు.
Also Read: స్టార్ క్రికెటర్ తో డేటింగ్ పై మొదటిసారి స్పందించిన మృణాల్ ఠాకూర్!
అదే విధంగా యూట్యూబ్ లో ఈ పాటపై ఇప్పటి వరకు 5 లక్షల 13 వేల షార్ట్స్ పడ్డాయి. ఇప్పటి వరకు హిస్టరీ లో ఏ పాటకు కూడా మూడు వారాల్లో ఇంతటి రీచ్ రావడం జరగలేదు. ఇదంతా పక్కన పెడితే ఈ పాటలోని రామ్ చరణ్ స్టెప్పులను చూసి కేవలం కుర్రాళ్లకు మాత్రమే కాదు, పెద్దలకు కూడా చిందులు వెయ్యాలని అనిపిస్తుందని రీసెంట్ గా సోషల్ మీడియా లో వైరల్ అయిన ఒక వీడియో ని చూస్తే తెలుస్తోంది. 80 ఏళ్లకు పైగా వయస్సు ఉన్న ఒక అవ్వ, పెళ్లి ఫంక్షన్ లో చికిరి చికిరి పాటకు స్టెప్పులు వేయడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆ అవ్వ లో ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూసి నెటిజెన్స్ సంబరపడుతున్నారు. ఈ వయస్సులోనే ఈ అవ్వ ఇలా ఉందంటే, కుర్ర వయస్సులో దుమ్ము లేపేసి ఉంటుందని డైలాగ్స్ వేస్తున్నారు.
సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఆ వీడియో ని మీరు కూడా క్రింద చూసేయండి. ఇకపోతే యూట్యూబ్ లో ఈ పాటకు రోజుకి రెండు మిలియన్ కి పైగా వ్యూస్ వస్తున్నాయి. ప్రస్తుతానికి కేవలం తెలుగు వెర్షన్ నుండి ఈ పాటకు 78 మిలియన్ వ్యూస్ రాగా, హిందీ వెర్షన్ కి 30 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. హిందీ వెర్షన్ లో పుష్ప పాటల తర్వాత ‘పెద్ది’ పాటకే అంతటి రీచ్ వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడే ఇలా ఉంటే, ఇక సినిమా విడుదల సమయం లో ఏ రేంజ్ లో ఉంటుందో అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరియు రాబోయే రోజుల్లో ఈ పాట ఎన్ని అద్భుతాలను నెలకొల్పబోతుంది అనేది.
At this point.. #ChikiriChikiri Song of the Year, NO Doubt !!
BTW, Grandma’s Grace #RamCharan #Peddipic.twitter.com/nyNsg9baIh— Telugu Chitraalu (@CineChitraalu) December 1, 2025