Sukumar Ram Charan Movie Update: ఈమధ్య కాలం లో సీక్వెల్స్ కంటే యూనివర్స్ ట్రెండ్ ని మేకర్స్ బాగా అనుసరిస్తున్నారు. లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) ఈ ట్రెండ్ కి ఆజ్యం పోసాడు. ఖైదీ చిత్రానికి ‘విక్రమ్’ చిత్రాన్ని కనెక్ట్ చేస్తూ, ఆయన పెట్టిన లింక్ ఏదైతే ఉందో, దానికి ఆడియన్స్ మెంటలెక్కిపోయారు. అదే విధంగా ‘లియో’ చిత్రం లో ‘విక్రమ్’ మూవీ కనెక్షన్ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. ఇలా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ బాగా క్లిక్ అవ్వడం తో, మేకర్స్ ఇకపై ఇలాంటి యూనివర్స్ లను క్రియేట్ చేయడానికి అమితాసక్తిని చూపిస్తున్నారు. రీసెంట్ గానే విడుదలైన పవన్ కళ్యాణ్ ఓజీ కి కూడా, ప్రభాస్ సాహూ మూవీ కి లింక్ పెట్టారు. ఇది అంతగా పేలకపోయినా, థియేటర్ లో ఈ సన్నివేశం వచ్చినప్పుడు మంచి రెస్పాన్స్ అయితే ఆడియన్స్ నుండి వచ్చింది. ఇదంతా పక్కన పెడితే త్వరలోనే సుకుమార్ సినిమాటిక్ యూనివర్స్ ని చూడబోతున్నాం అంటూ సోషల్ మీడియా లో ఒక వార్త వినిపిస్తోంది.
Also Read: స్టార్ క్రికెటర్ తో డేటింగ్ పై మొదటిసారి స్పందించిన మృణాల్ ఠాకూర్!
పూర్తి వివరాల్లోకి వెళ్తే, ‘పుష్ప 2’ తర్వాత డైరెక్టర్ సుకుమార్(Sukumar) రామ్ చరణ్(Global Star Ram Charan) తో ఒక సినిమా చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లో సుకుమార్ ఫుల్ బిజీ గా ఉన్నాడు. ‘పెద్ది’ సినిమా పూర్తి అయ్యాక, కాస్త గ్యాప్ తీసుకొని రామ్ చరణ్ ఈ సినిమాని మొదలు పెట్టబోతున్నాడు. అయితే ఈ చిత్రానికి, త్వరలో సుకుమార్ తియ్యబోయే ‘పుష్ప 3’ చిత్రానికి ఒక చిన్న లింక్ ఉండబోతుంది అట. ఈ సినిమా క్లైమాక్స్ తోనే ‘పుష్ప 3’ కి లీడ్ ఉండేలా ప్లాన్ చేసాడట సుకుమార్. అంటే రామ్ చరణ్, సుకుమార్ సినిమా క్లైమాక్స్ లో అల్లు అర్జున్ పుష్ప రాజ్ క్యారక్టర్ లో కనిపించబోతున్నాడు అన్నమాట. ఇండియా లోనే మోస్ట్ ఐకానిక్ క్యారక్టర్ గా పేరు తెచ్చుకున్న పుష్ప రాజ్ క్యారక్టర్ తో సినిమాటిక్ యూనివర్స్ అంటే మామూలు విషయం కాదు.
ప్రస్తుతానికి ఇది రూమర్ మాత్రమే. కానీ డైరెక్టర్ సుకుమార్ ఇది నిజమే అని అధికారిక ప్రకటన చేసిన రోజు మాత్రం సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుంది అనుకోవచ్చు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రామ్ చరణ్ పరిచయ సన్నివేశాన్ని #RRR మూవీ షూటింగ్ సమయం లోనే డైరెక్టర్ సుకుమార్ షూట్ చేసాడట. ఆ సన్నివేశాన్ని రాజమౌళి చూసి ఆశ్చర్యపోతూ ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన మాటలను చూస్తే, ఈ కాంబినేషన్ లో రాబోయే సినిమా ఎలా ఉండబోతుందో ఒక ఐడియా కి రావొచ్చు. ‘రంగస్థలం’ చిత్రం తో ప్రభంజనం సృష్టించి, రామ్ చరణ్ లోని అద్భుతమైన నటన ని బయటపెట్టిన సుకుమార్, ఇప్పుడు ఈ చిత్రం తో ఆయనలో ఏ కోణాన్ని బయటపెట్టబోతున్నాడో చూడాలి.