Homeఎంటర్టైన్మెంట్Micheal: మైఖేల్​ సినిమాలో విలన్​గా ప్రముఖ దర్శకుడు

Micheal: మైఖేల్​ సినిమాలో విలన్​గా ప్రముఖ దర్శకుడు

Micheal: చిన్న హీరోగా సినీ ప్రస్థానం మొదలుపెట్టి.. ప్రస్తుతం టాప్​ యంగ్​ హీరోల్లో ఒకరిగా దూసుకెళ్తున్నాడు సందీప్ కిషన్​. తాజాగా, సందీప్​ కిషన్​ హీరోగా రంజిత్​ జేయకోడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్నతాజా సినిమా మైఖేల్​. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా.. వివిధ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్​ఎల్​పి, రణ్ సి ప్రొడక్షన్స్​ ఎల్​ ఎల్​పి పతాకాలపై భరత్ చౌదరీ, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజాగా, ఈ సినిమాలో విలక్షణ నటుడు, దర్శకుడు నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు గౌతమ్​ వాసుదేవ్​ మీనన్​ ఈ సినిమాలో విలన్​ పాత్రలో నటించనున్నారు. తాజాగా, ఇందుకు సంబంధించిన ఓ అప్​డేట్​ను చిత్ర యూనిట్​ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఓ పోస్టర్​ను విడుదల చేసింది. ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కాగా, ఇటీవలే ఏ1 ఎక్స్ప్రెస్​, గల్లీబాయ్​ సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన సందీప్​ కిషన్​.. మంచి టాక్​ అందుకున్నారు. కాగా, ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్​తో మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. మరి ఈ సారి కూడా హిట్​ కొడతాడా లేదా చూడాలి. మరోవైపు, టాప్​ యాక్టర్లు తన సినిమాలో నటిస్తుండటంతో మఖేల్​ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular