Akshay Kumar: బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ కి మూవీ మెషిన్ గా పేరుంది. స్టార్ హీరోలలో ఒక్కరిగా ఉన్న అక్షయ్ ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తారు. ఒకప్పటి స్టార్ హీరోలైన కృష్ణ, ఎన్టీఆర్, ఏఎన్నార్ ఈ తరహాలో ఏడాదికి పదుల సంఖ్యలో సినిమాలు చేసేవారు. రాను రాను సినిమా బడ్జెట్ తోపాటు నిర్మాణ విలువలు, సాంకేతికత పెరగడంతో ఒక్కో మూవీ చేయడానికి రెండు మూడేళ్ల సమయం కూడా కొందరు దర్శకులు తీసుకుంటున్నారు.

ముఖ్యంగా స్టార్ హీరోల నుండి ఏడాదికి ఒక మూవీ రావడం కూడా గగనమైపోతుంది. అయితే పరిస్థితులు ఎంత మారినా సూపర్ ఎనర్జీ కనబరుస్తూ అక్షయ్ కుమార్ వరుస చిత్రాలు చేస్తున్నారు. ఆగస్టు లో బెల్ బాటమ్ మూవీ విడుదల చేసిన అక్షయ్ రెండు నెలల వ్యవధిలో మరో చిత్రం సూర్యవంశీ విడుదల చేశారు. అత్రాంగి రే, బచ్చన్ పాండే, రామ్ సేతు, రక్షా బంధన్ ఇలా మొత్తం మరో ఏడు సినిమాలు చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.
ఆర్జనలో సైతం బాలీవుడ్ హీరోలకు అందనంత ఎత్తులో అక్షయ్ కుమార్ ఉన్నారు. కాగా టాలీవుడ్ లో మెగాస్టార్ కూడా అలానే తయారయ్యారు. ఆయన వరుస చిత్రాలు చేస్తూ, కుర్ర హీరోలకు సవాలు విసురుతున్నారు. ఆచార్య షూటింగ్ పూర్తి చేసిన చిరంజీవి, మరో మూడు చిత్రాలు సెట్స్ పైకి తీసుకెళ్లాడు. కాగా మరో రెండు చిత్రాలు ఒకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
చరణ్ తో కలిసి దర్శకుడు కొరటాల శివతో చేస్తున్న ఆచార్య ఫిబ్రవరి 4న విడుదల కానుంది. దర్శకుడు మెహర్ రమేష్ తో చేస్తున్న భోళా శంకర్, కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో చేస్తున్న మెగా 154 పూజా కార్యక్రమాలు జరుపుకున్నాయి. భోళా శంకర్ ఫస్ట్ షెడ్యూల్ పాత బస్తీలో మొదలైనట్లు సమాచారం. అలాగే దర్శకుడు మోహన్ రాజాతో లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ చేస్తుండగా, షూటింగ్ దశలో ఉంది. ఇవి పూర్తి కాకుండానే మరో రెండు ప్రాజెక్ట్స్ చిరంజీవి ఓకే చేసినట్లు వార్తలు అందుతున్నాయి.
Also Read: Samantha: ఆ విషయంలో ఓకే చెప్పేందుకు భాష పెద్ద సమస్య కాదంటున్న సమంత
భీష్మ మూవీతో హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో ఓ ప్రాజెక్ట్ కి చిరంజీవి సైన్ చేశారట. అలాగే దర్శకుడు మారుతీతో ఓ మూవీ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇక చిరంజీవి జోరు చూసిన ఫ్యాన్స్ టాలీవుడ్ అక్షయ్ కుమార్ అంటున్నారు.
Also Read: RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ పాట.. అందులో నిజమెంత?