రాష్ట్రన్లో కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో పిల్లలు వైరస్ బారిన పడకుండా ఉండాలెని ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఆదేశాల ప్రకారం విద్యార్థులకు వంట చేసే సిబ్బంది బంగారం, గాజులు, రింగులు, వాచ్ ధరించకూడదు. గోళ్లకు నెయిల్ పాలిష్ వేసుకోకూడదు. విద్యార్థులకు వండే కూరగాయలను ప్రతిరోజు ఉప్పు పసుపు సహాయంతో శుభ్రం చేయాలి.
విద్యార్థులకు వంట వండే ప్రదేశంతో పాటు, విద్యార్థులు భోజనం చేసే ప్రదేశం శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. భోజనం చేసే సమయంలో విద్యార్థులు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు చేపట్టాలి. జగన్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే ఉద్యోగులు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఫలితంగా పిల్లలకు టీచర్ల ద్వారా వైరస్ సోకే ప్రమాదం ఉండదని భావిస్తోంది.
ప్రభుత్వ ఉపాధాయులు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎక్కడైనా కరోనా వైరస్ పరీక్షలు చేయించుకోవచ్చని.. కరోనా పరీక్షలకు సంబంధించిన నివేదికలను ఉన్నతాధికారులకు పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. స్కూళ్ల రీఓపెన్ నేపథ్యంలో వైరస్ ప్రబలకుండా జగన్ సర్కార్ అన్ని చర్యలు చేపడుతోంది.