
రాజకీయాలు దేశాభివృద్ధికి ఆటంకంగా మారకూడదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాజకీయాలను దూరంగా ఉంచాలన్నారు. దేశ మౌలిక సదుపాయాలు ఓ ప్రస్థానంగా కొనసాగాలని, ఐదేళ్ళ రాజకీయాల కోసం కాకుండా అనేక తరాలకు లబ్ధి చేకూర్చేందుకు ఈ ప్రస్థానం జరగాలని అన్నారు. ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఆపరేషన్ కంట్రోల్ సెంటర్‌ను, న్యూ భావ్‌పూర్-న్యూ ఖుర్జా సెక్షన్‌ను మంగళవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడారు.