https://oktelugu.com/

అనుష్కపై ‘నిశబ్దం’ ఎఫెక్ట్.. మళ్లీ బ్రేక్ తీసుకుంటుందా?

సౌత్ ఇండియాలోని టాప్ హీరోయిన్లలో అనుష్క శెట్టి(స్వీటీ) ఒకరు. ‘సూపర్’ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యెగా టీచర్ కొద్దిరోజుల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అనుష్క శెట్టి తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ నటించి దక్షిణాది హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. Also Read: మెగాస్టార్ కోలువాలని పూజలు చేస్తున్న హీరోయిన్.. ఎవరో తెలుసా? అనుష్క కెరీర్ తొలినాళ్లలో గ్లామర్ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకుంది. 2009లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో నటించిన ‘అరుంధతి’తో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 11, 2020 / 06:44 PM IST
    Follow us on


    సౌత్ ఇండియాలోని టాప్ హీరోయిన్లలో అనుష్క శెట్టి(స్వీటీ) ఒకరు. ‘సూపర్’ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యెగా టీచర్ కొద్దిరోజుల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అనుష్క శెట్టి తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ నటించి దక్షిణాది హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

    Also Read: మెగాస్టార్ కోలువాలని పూజలు చేస్తున్న హీరోయిన్.. ఎవరో తెలుసా?

    అనుష్క కెరీర్ తొలినాళ్లలో గ్లామర్ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకుంది. 2009లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో నటించిన ‘అరుంధతి’తో ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. అరుంధతి తర్వాత వేదం.. రుద్రమదేవి.. పంచాక్షరి.. భాగమతి.. నిశబ్ధం వంటి లేడి ఓరియేంటెడ్ సినిమాల్లో నటించి తన క్రేజ్ మరింత పెంచుకుంది.

    Also Read: బిగ్ బాస్-4 బ్యూటీకి హీరోయిన్ అవకాశాలు..!

    అనుష్క ఓ వైపు గ్లామర్ పాత్రలను చేస్తూనే లేడి ఓరియంటేడ్ సినిమాలు చేసింది. అయితే భాగమతి సినిమా తర్వాత అనుష్క ‘నిశబ్దం’ మూవీ కోసం రెండేళ్ల గ్యాప్ తీసుకుంది. ఇటీవలే ‘నిశబ్ధం’ మూవీ ఓటీటీలో రిలీజైన సినిమా మాత్రం ప్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో అనుష్క తన తదుపరి మూవీపై ఆచితుచి అడుగులు వేస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ‘నిశబ్ధం’ తర్వాత అనుష్క యూవీ క్రియేషన్స లో ఓ యంగ్ డైరెక్టర్ తో నటిస్తుందనే టాక్ విన్పించింది. అలాగే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటిస్తుందనే ప్రచారం జరిగింది. అయితే ‘నిశబ్దం’ తర్వాత అనుష్క సినిమాలకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. దీంతో అనుష్క మళ్లీ గ్యాప్ తీసుకుంటుందా? అని ఆమె ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇకనైనా అనుష్క తన తదుపరి సినిమాలపై అప్డేట్స్ ఇస్తుందో లేదో వేచిచూడాల్సిందే..!