దీపావళిని కాలుష్య రహితంగా జరుపుకోవాలి: ఏపీ ప్రభుత్వం

కరోనా వైరస్ ప్రభంజనం నేపథ్యంలో దీపావళి పండుగలో బాణసంచా కాల్చ వద్దని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ సైతం గాలి తక్కువగా ఉన్న ప్రదేశాల్లో టపాకాయాలు కాల్చుకోవడమే బెటరని సూచించింది. అందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయాలు తీసుకోవాలని సూచింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం సైతం దీపావళి పండగను  కరోనా రహితంగా జరుపుకోవాలని సూచించింది. Also Read: ఎస్వీబీసీ ఛానెల్ లో అసలేం జరుగుతోంది..? కోవిడ్ విస్తరిస్తున్న […]

Written By: NARESH, Updated On : November 11, 2020 7:33 pm
Follow us on

కరోనా వైరస్ ప్రభంజనం నేపథ్యంలో దీపావళి పండుగలో బాణసంచా కాల్చ వద్దని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ సైతం గాలి తక్కువగా ఉన్న ప్రదేశాల్లో టపాకాయాలు కాల్చుకోవడమే బెటరని సూచించింది. అందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయాలు తీసుకోవాలని సూచింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం సైతం దీపావళి పండగను  కరోనా రహితంగా జరుపుకోవాలని సూచించింది.

Also Read: ఎస్వీబీసీ ఛానెల్ లో అసలేం జరుగుతోంది..?

కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో దీపావళి పండుగను కాలుష్య రహితంగా జరుపుకోవాలని సూచించారు. రాత్రి ఎనిమిది గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాకాయలు కాల్చుకోవాలన్నారు. టపాసులు కాల్చడంపై పూర్తిగా నిషేధించలేమని అయితే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కాల్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ బీఎస్ఎస్ ప్రసాద్ ఇటీవలే పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు రానందున పూర్తిగా నిషేధించలేమన్నారు.

Also Read: ఏపీలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ రెడీ..!

అయితే ప్రభుత్వం పూర్తిగా నిషేధించకున్న ప్రజలు కాలుష్య రహిత పటాకలు కాల్చాలని కోరారు. బాణసంచా అమ్మకాల విషయంలో కూడా విక్రయదారులు కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించింది ప్రభుత్వం. భౌతిక దూరం పాటించకుండా బాణసంచా విక్రయిస్తే షాప్ సీజ్ చేస్తామన్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్