Nagababu – Pawan : ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఏ హీరోకు లేని క్రేజ్ ఆయన సొంతం. ఆయన పేరు చెబితే ఇండస్ట్రీ రికార్డ్ లు కూడా భయం తో వణికి పోతాయి. ఆయన సినిమా వస్తుందంటే స్టార్ హీరోలు కూడా తమ సినిమాలను వాయిదా వేసుకోవాల్సిందే.ఆయనెవరో కాదు ఇండస్ట్రీ ని శాశిస్తున్న ఒకే ఒక్కడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…ఇక ఇది ఇలా ఉంటే అప్పట్లో ఈయన చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పవర్ ప్యాక్ పెర్ఫా మెన్స్ ను ఇస్తూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను, తన అభిమానులను కూడా అలరిస్తూ వచ్చాడు. అంతటి ఫాలోయింగ్ ను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ కెరియర్ స్టార్టింగ్ లో కొట్టిన సక్సెస్ లు మాత్రం ఆయనకు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతాయనే చెప్పాలి.
ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ తమ్ముడు గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కి అసలు మొదట్లో సినిమాల్లోకి రావాలనే ఇంట్రెస్టే లేదట. దాంతో చిరంజీవి పట్టుబట్టి మరి పవన్ కళ్యాణ్ ను ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇప్పించాడు. ఇక ఇవివి సత్యనారాయణ డైరెక్షన్ లో ఈయన చేసిన మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దాంతో కొంత వరకు నిరాశ చెందిన పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయకూడదు అనుకున్నాడట. ఇక ఇదిలా ఉంటే ఒక రోజు ఇంట్లో ఒక్కడే టీవీ చూస్తూ కూర్చున్నాడట . సరిగ్గా అదే సమయానికి పవన్ కళ్యాణ్ దగ్గరికి నాగబాబు వచ్చి నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తున్నావ్ కళ్యాణ్ అని అడిగాడట. దాంతో పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు ఆపేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడట. దాంతో విపరీతమైన కోపానికి లోనైనా నాగబాబు నువ్వు చేసిందే ఒక సినిమా అది కూడా సరిగ్గా ఆడలేదు.
దాంతో సినిమాలు ఆపేయడమేంటి నీకు సినిమాలు చేయడం ఇంట్రెస్ట్ లేకపోతే అది ముందే చెప్పాల్సింది. నీ మీద చాలా నమ్మకం పెట్టుకొని, అన్నయ్య నిన్ను హీరోగా ఇండస్ట్రీకి తీసుకొస్తే, ఏదో ఒక సినిమా చేసి ఇక ఇప్పుడు సినిమాలు ఆపేస్తా అంటే ఎలా.? అయిన అలా చేస్తే నీకు సక్సెస్ కొట్టడం చేతకాక సినిమా ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్లిపోయావు అంటూ నీ మీద చాలా విమర్శలు చేస్తారు. అలాగే నిన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చినందుకు అన్నయ్య కూడా చాలా అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ నాగబాబు చాలా కోపంగా పవన్ కళ్యాణ్ మీద అరుస్తూనే, నీకు దమ్ముంటే ఒక్క సినిమా సక్సెస్ కొట్టి చూపించు కళ్యాణ్ అని కోపంతో గట్టిగా అరిచాడట…దాంతో పవన్ కళ్యాణ్ కూడా కోపానికి వచ్చి ఒక్కటి కాదు వరుసగా ఐదు హిట్లు కొట్టి చూపిస్తా చూడు అని సవాల్ చేశాడట…ఇక చెప్పిన మాట ప్రకారం తన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన స్టోరీలను వింటూ చాలా బిజీ అయిపోయాడట. మొత్తానికైతే ముత్యాల సుబ్బయ్య చెప్పిన గోకులంలో సీత కథను ఓకే చేసి ఆ సినిమాను చేసి సక్సెస్ సాధించాడు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఒకటి కాదు వరుసగా ఆరు సక్సెస్ లను కొట్టి ఇండస్ట్రీలో తన స్టామినాయెంటో చూపించాడు. అలాగే అన్నకు తగ్గ తమ్ముడిగా ఎదిగాడు.
పవన్ కళ్యాణ్ ఈగో ను టచ్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. ఇక ఈ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని తన సన్నిహితుల దగ్గర చెబుతూ మా అన్నయ్య తో నేను ఛాలెంజ్ చేయకపోయి ఉంటే ఇప్పుడు అసలు ఇండస్ట్రీలో ఉండేవాడిని కాదేమో అంటూ ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకొని నవ్వుకుంటాడట…