https://oktelugu.com/

Vijay Devarakonda: ప్రభాస్ లాగానే విజయ్ దేవరకొండ.. ఇక దొరకడు

కొడితే దరిద్రం వదిలిపోవాలి.. ఇక వెనక్కి తిరిగి చూసుకోవద్దు.. లేట్ అయినా మంచిదే.. కానీ అలాంటి కథలే కావాలి.. అలాంటి సినిమా ఒకటి పడాలి. బాహుబలి మూవీ దెబ్బకు రెబల్ స్టార్ ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా అన్నీ ప్యాన్ ఇండియా లెవల్ సినిమాలు చేస్తున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ తీసిన ‘సాహో’, రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే.. మొత్తం దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయడానికి యూనిక్ […]

Written By:
  • NARESH
  • , Updated On : August 26, 2021 / 05:39 PM IST
    Follow us on

    కొడితే దరిద్రం వదిలిపోవాలి.. ఇక వెనక్కి తిరిగి చూసుకోవద్దు.. లేట్ అయినా మంచిదే.. కానీ అలాంటి కథలే కావాలి.. అలాంటి సినిమా ఒకటి పడాలి. బాహుబలి మూవీ దెబ్బకు రెబల్ స్టార్ ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా అన్నీ ప్యాన్ ఇండియా లెవల్ సినిమాలు చేస్తున్నాడు.

    బాహుబలి తర్వాత ప్రభాస్ తీసిన ‘సాహో’, రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే.. మొత్తం దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయడానికి యూనిక్ కథలనే ఎంచుకున్నాడు. ప్యాన్ ఇండియా సినిమాలనే చేస్తున్నాడు.

    ఇప్పుడు ఇదే బాటపట్టాడు విజయ్ దేవరకొండ.. ఇంకా ప్యాన్ ఇండియా మూవీ ‘లైగర్’ రిలీజ్ కాకముందే విజయ్ దేవరకొండ స్థానిక తెలుగు దర్శకులకు అందకుండా పోతున్నాడట.. ఇటీవల టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ కథ వింటావా? ఒక కథ ఉందని విజయ్ దేవరకొండను సంప్రదిస్తే.. ‘ఇది ప్యాన్ ఇండియా కథనా.. కాదా?’ అని అడుగుతున్నాడట.. దీంతో విజయ్ దేవరకొండ రేంజ్ పెరిగిపోయిందని.. ఇక తెలుగులో సినిమాలు తీయడు కావచ్చని అంటున్నారు.

    పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం ప్యాన్ ఇండియా లెవల్లో ‘లైగర్’ మూవీ చేస్తున్నాడు. కరోనా కారణంగా అది వాయిదా పడింది. ఆ మూవీ విడుదల కాకుండానే.. ఫలితం తేలకుండానే హీరో విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా లెవల్లో కలలు కంటుండడం విశేషంగా మారింది.