
రవీంద్ర జడేజా మాయ చేశాడు. ఇంగ్లాండ్ ఓపెనర్ హమీద్ (68) బౌల్డ్ చేశాడు. 63 వ ఓవర్ చివరి బంతి వికెట్లను తాకడంతో 159 పరుగుల వద్ద ఇంగ్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది. మరో వైపు మలన్ (18) పరుగులతో ఉండగా రూట్ క్రీజులోకి వచ్చాడు. ఇంగ్లాండ్ ఆధిక్యం ప్రస్తుతం 80 పరుగులకు చేరింది.