
‘బాహుబలి’ సినిమాలో అత్యంత ఆసక్తి రేపే అంశం ఏదైనా ఉందంటే అది ‘బాహుబలిని కట్టప్ప ఎలా చంపాడన్నదే’.. దాన్ని సీక్రెట్ గా ఉంది ఏకంగా దేశ ప్రధాని మోడీలోనూ ఆసక్తిని కలిగించాడు మన దర్శకధీరుడు రాజమౌళి.
ఇప్పుడు అలాంటి బాహుబలి థీమ్ నే ‘పుష్ప’లోనూ పెట్టేశాడట సుకుమార్.. బాహుబలిలాగానే రెండు పార్ట్ లుగా ‘పుష్ఫ’ మూవీని తీస్తున్నాడు సుకుమార్. అంతేకాదు.. బాహుబలిలోని కీలకమైన ఆ పాయింట్ ను కూడా తీసుకొని పుష్పలోనూ అలాంటి ప్రయోగమే చేయబోతున్నాడట…
పుష్ప 1 క్లైమాక్స్ చూశాక కూడా అల్లు అర్జున్ పై అలాంటిదే క్రియేట్ చేయబోతున్నాడట సుకుమార్. ఓ లారీ డ్రైవర్ డాన్ పుష్పగా ఎలా మారాడు? విలన్ గ్యాంగ్ లోని ఒకరి హస్తం ఉంటుందట.. కట్టప్పలా విలన్ గ్యాంగ్ లో ఉండి సపోర్టు చేసే ఓ పాత్రలో ఓ కీలక నటుడు కనిపించబోతున్నాడట.. అతడు ఎవరు అన్నది మాత్రం సస్పెన్స్.
ఈ ఆసక్తిని రెండో సినిమా 2లో చూపించబోతున్నారట.. అలా ఓ ఆసక్తికరమైన ప్రశ్నతో పుష్ప 1ని ముగించి.. పుష్ప 2ని మొదలు పెట్టబోతాడట సుకుమార్. కట్టప్ప బాహుబలికి వెన్నుపోటు పొడిస్తే.. ఇక రివర్స్ లో హీరో అల్లు అర్జున్ కు సపోర్టు చేసే కీలక పాత్రను సుకుమార్ సృష్టించాడట.. కథలో మెయిన్ అదే ట్విస్ట్ అంటున్నారు చూడాలి మరీ ఏం జరుగుతుందో..