Mahesh Babu Rejection: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ కి చాలా మంచి ఇమేజ్ అయితే ఉంది. మహేష్ బాబు సైతం సూపర్ స్టార్ రేంజ్ ఇమేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగాడు. ప్రస్తుతం పాన్ వరల్డ్ లో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటివరకు ఆయన ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు. అయినప్పటికి రాజమౌళితో కలిసి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు అంటే నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. మహేష్ బాబు ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తయితే రాజమౌళితో చేస్తున్న ఈ సినిమా మరొక ఎత్తుగా మారబోతోంది. ఇక ఇది ఇలా ఉంటే సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబుని హీరోగా చేద్దామనుకున్న సందర్భంలో కొంతమంది స్టార్ డైరెక్టర్లని అప్రోచ్ అయ్యారట. అందులో తమిళ్ స్టార్ డైరెక్టర్ గా చెప్పుకునే ఆయన్ని సైతం కలిశామని అప్పట్లో కృష్ణ చెప్పాడు. అయితే ఆ దర్శకుడు మహేష్ బాబు ను చూసి మహేష్ లుక్స్ సాఫ్ట్ గా ఉన్నాయి ఆయన మాస్ హీరోగా సెట్ అవ్వడు. కేవలం క్లాస్ సినిమాలు, లవ్ స్టోరీస్ కి మాత్రమే సెట్ అవుతాడు అంటూ చెప్పాడట. దాంతో కృష్ణ కొంతవరకు కలవరపడ్డాడట. ఎందుకంటే మహేష్ బాబుని మాస్ హీరోగా నిలబెట్టాలనే కృష్ణ కోరిక…
Also Read: ‘ఓజీ’ షూటింగ్ ఇంకా పూర్తి అవ్వలేదా..? అభిమానుల్లో మొదలైన టెన్షన్!
అలాగే ఆయన కి కూడా మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉండటం వల్ల తన కొడుకు మాస్ హీరోగా ఎదిగితే స్టార్ హీరో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది కృష్ణ గారి భావన… మరి దానికి తగ్గట్టుగానే ఆ స్టార్ డైరెక్టర్ దగ్గర నుంచి బయటకు వచ్చి రాఘవేంద్రరావు గారితో మహేష్ బాబు మొదటి సినిమా చేయించాలని పట్టుపట్టి మరీ ‘రాజకుమారుడు’ సినిమాని చేయించాడు.
మొత్తానికైతే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో మహేష్ బాబుకి నటుడిగా మంచి గుర్తింపైతే వచ్చింది. ఇక అప్పటినుంచి ఆయన వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగాడు. ఎప్పుడైతే ఒక్కడు, పోకిరి సినిమాలు వచ్చాయో ఆయన ఫుల్ టైం మాస్ హీరోగా మారిపోయాడు…
Also Read: ప్యారడైజ్ సినిమా విషయంలో నాని కి శ్రీకాంత్ ఓదెలకి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయా..?
ఇక మహేష్ బాబు మాస్ హీరోగా పనికిరాడు అని చెప్పిన ఆ దర్శకుడు ఎవరు అనేది కృష్ణ అతని పేరు అయితే చెప్పలేదు. కానీ తమిళ్ ఇండస్ట్రీలో అతను ఒక స్టార్ డైరెక్టర్ అని తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయన చాలా సినిమాలు చేశాడని చెప్పడం విశేషం…ఇక అప్పటి న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది…