Nani Paradise Movie: నాచురల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు నాని… అష్టాచమ్మ సినిమాతో హీరోగా పరిచయమైన ఆయన ఆ తర్వాత చేసిన వరుస సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. కారణం ఏంటి అంటే ఇంతకుముందు ఆయన చేసినవి క్లాస్ సినిమాలు కానీ ఇప్పుడు నాని మాస్ అవతారం ఎత్తాడు… ఈ సినిమాతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఆయన ఇక మీదట చేయబోతున్న సినిమాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టినవే కావడం విశేషం…ఇక ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకోవాలనే తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక తను అనుకున్నట్టుగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ దక్కనటువంటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్లాలనే ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఒక్కసారిగా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేశాడు.
Also Read: ‘ఓజీ’ షూటింగ్ ఇంకా పూర్తి అవ్వలేదా..? అభిమానుల్లో మొదలైన టెన్షన్!
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలైతే నెలకొన్నాయి. నాని హీరోగా చేస్తున్న ఈ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధిస్తుంది అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. నాని హీరోగా, విలన్ గా నటిస్తున్నాడట.
మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు కానీ మొత్తానికి అయితే సోషల్ మీడియాలో ఒక న్యూస్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక దానికి తోడుగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ జరగాల్సిన సమయంలో శ్రీకాంత్ ఓదెలకి నానికి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినట్టుగా కూడా తెలుస్తున్నాయి.
Also Read: ఇండియాలో ఇప్పటి వరకు హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరో ఎవరో తెలుసా..?
మరి దీని వల్ల సినిమా షూటింగ్ కొద్ది రోజులపాటు డిలే చేస్తున్నారనే వార్తలైతే వస్తున్నాయి. మరి వీళ్ళ మధ్య వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ తగ్గిపోయాయా? ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయి సినిమాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా? లేదా అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది…