ఎంటర్టైన్మెంట్Venkatesh Neeraja : నీరజను వెంకటేష్ అందుకే పెళ్లి చేసుకున్నాడు.. ఆమె ఆస్తి ఎంతో తెలుసా?...

Venkatesh Neeraja : నీరజను వెంకటేష్ అందుకే పెళ్లి చేసుకున్నాడు.. ఆమె ఆస్తి ఎంతో తెలుసా? వీరి వివాహం వెనుక సీక్రెట్ ఇదే..

Venkatesh Neeraja :  చేతికి ఉన్న వేళ్లే ఒకలా ఉండవు. అలాంటిది మనుషులు అందరూ ఒకలా ఉంటారా? అందులో ఇండస్ట్రీలోని హీరోలందరూ ఒకే విధంగా ఉంటారా? అసాధ్యం కదా.. అయితే ఒక మంచి వ్యక్తిత్వం, మంచి మనుసు ఉన్న హీరో ఎవరు అంటే వెంకటేష్ పేరు ముందుగా గుర్తు వస్తుంటుంది. అందులో మరీ ముఖ్యంగా ఈయన వ్యక్తిత్వం అంటే చాలా మందికి ఇష్టం. ఇండస్ట్రీలో కలియుగ పాండవులు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్ గా రానానాయుడు అనే వెబ్ సిరీస్ తో పలకరించారు. కానీ ఇప్పటికీ ఎలాంటి రూమర్ లేదు ఈ హీరోపై..

ఒక సందర్భంలో బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ ప్రోగ్రాంలో తానే స్వయంగా వెంకీని కొనియాడారు. సినీ ఇండస్ట్రీలో స్వామి వివేకానంద అని పొగడడంతో వెంకీ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ఇలా మంచికి మారుపేరుగా ఉంటూ.. చెడును, చెడు రూమర్స్ ను దగ్గరికి రానివ్వకుండా ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీని ఏలినా విక్టరీ పెళ్లి, ఆయన సతీమణి నీరజ గురించి కొన్ని విషయాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ఇంతటి మహోన్నతమైన క్యారెక్టర్ ఉన్న వెంకటేష్ కు ఇప్పటికీ మహిళల్లో ఎంతో ఆదరణ ఉంది. ఒక వివాహబంధంలో వారు అద్భుతంగా ఉన్నారు అంటే దానికి ప్రధాన కారణం వారికి వచ్చిన జీవిత భాగస్వామి. అయితే వెంకటేష్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఆయన పర్శనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. ఆయన ఎప్పుడూ, ఎక్కడా తన భార్య, పిల్లల గురించి గాని కుటుంబ విషయాల గురించి కానీ మాట్లాడరు. నీరజారెడ్డి గంగవరపు వెంకటసుబ్బారెడ్డి ఉషారాణి దంపతులకు జన్మించింది. ఈమెది చిత్తూరు జిల్లా మదనపల్లి సొంత ఊరు.

నీరజా కుటుంబ సభ్యులు జమీందారి కుటుంబం అని టాక్. అంతే కాదు ఆమె తండ్రి భూస్వామట. భూమితో పాటు వ్యాపారాలు కూడా చాలా ఉన్నాయట. మదనపల్లిలో పేరు పలుకుబడి ఉన్న వ్యక్తి ఎవరు అంటే వెంటనే ఈయన పేరు వినిపిస్తుంది అని ఇప్పటీకీ టాక్ ఉంది. ఒకానొక సమయంలో రామానాయుడు వెంకటేష్ కు పెళ్లి చేయాలని ఎవరైనా అమ్మాయి ఉంటే చూడాలని విజయ నాగిరెడ్డి చెప్పగా నీరజా గురించి చెప్పారు. నీరజ అమ్మమ్మ గారిది కృష్ణాజిల్లా కాకిలూరు దగ్గర ఉన్న వరాహ పట్నం, వీరిది కూడా సంపన్న కుటుంబమే, నీరజా చదువుకునే రోజుల్లో సెలవుల సమయంలో వారి అమ్మ వారి ఇంటికి వెళ్లి బాగా ఎంజాయ్ చేసే వారట.

2014లో బిజేపీ తరుపున పోటీ చేస కైకలూరు ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు నాయుడు క్యాబినేట్ లో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన కామినేని శ్రీనివాస రావు నీరజకు మేనమామ. ఎన్నికలప్పుడు కూడా నీరజా ప్రచారంలో పాల్గొన్న చాలా గ్రామాల్లో వీరికి సపోర్ట్ దొరికింది కూడా. ఈమె చదువులు మదనపల్లిలో సిఎస్ఐ గర్ల్స్ కాలేజీలో పదవ తరగతి వరకు చదివారు. తర్వాత మదనపల్లి లోని వీ.టి కాలేజీలో చదువుకున్నారు. అక్కడితోనే ఈమె చదువులు ఆగిపోలేదు ఎంబీఏ కూడా చేశారట. అయితే నాగిరెడ్డి సుబ్బారెడ్డి కుటుంబం గురించి చెప్పడంతో రామానాయుడు మదనపల్లి వెళ్లి ముందుగా నీరజాను చూసి వచ్చారు. తర్వాత పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఇద్దరూ ఒకరికొకరు నచ్చడంతో 1989 లో వెంకటేష్, నీరజ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అప్పటి నుంచి ఒక రిమార్క్ కూడా లేకుండా ఎంతో ఆదరణ పొందిన జంటగా, పాజిటివ్ టాక్ తోనే ముందుకు వెళ్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Chiranjeevi and Venkatesh : చిరంజీవి – వెంకటేష్ కలిసి చేయాల్సిన సినిమా ఎలా క్యాన్సిల్ అయింది…

Chiranjeevi and Venkatesh : మెగాస్టార్ చిరంజీవి గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. ఇప్పటికీ ఆయన యంగ్ హీరోలకు పోటీని ఇచ్చే విధంగా సినిమాలను...

Adarsha Kutumbam: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో…

Adarsha Kutumbam: వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం' సినిమా అక్టోబర్ రెండోవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా విషయంలో వెంకటేష్ చాలా క్లారిటీగా...

Most Popular

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...
Oktelugu Epaper
Exit mobile version