Star Heroes: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుంది. వాళ్ల నుంచి వచ్చే సినిమాలు సగటు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను సైతం తమ వైపు తిప్పుకుంటున్నారు. ఇక స్టార్ హీరోలందరు వరుసగా భారీ బడ్జెట్ సినిమాలను చేస్తూ భారీ కలెక్షన్స్ ను సాధించాలని చూస్తున్నారు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ మన స్టార్ హీరోలందరు ఆ విషయంలో మాత్రం చాలా వరకు పెద్ద పొరపాట్లు చేస్తున్నారు. వాళ్ళు ఎక్కువ బడ్జెట్ తో సినిమాలను చేయడంలో తప్పులేదు. అలాగే సినిమాకి భారీ కలెక్షన్స్ రావడంలో కూడా తప్పులేదు. నిజానికి ఒక సినిమాని చూసే సగటు ప్రేక్షకుడు సినిమా థియేటర్ కి వచ్చి సినిమాని చూడాలి అంటే ఆ సినిమా టికెట్ రేట్ అనేది అందరికీ రీజనబుల్ ప్రైస్ లో ఉండాలి. అలా ఉన్నప్పుడే ప్రేక్షకులు ఆ సినిమాని ఆదరిస్తారు. ఈ సినిమాకి కలెక్షన్స్ సైతం భారీగా వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా టిక్కెట్ రేట్లు పెంచడం వల్ల సినిమా మీద ఎఫెక్ట్ పడే అవకాశాలైతే ఉన్నాయి.
ఒకప్పుడు ఫెయిల్యూర్ సినిమాకి కూడా చాలా మంచి కలెక్షన్స్ వచ్చేవి…కారణం ఏంటంటే అప్పట్లో టికెట్ రేట్ తక్కువగా ఉండడం వల్ల అందరు ఒకసరైన ఆ సినిమాను చూసి ఎంజాయ్ చేద్దాం అనుకునేవాళ్లు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టుగా బడ్జెట్లను పెంచేస్తున్నారు.
భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా టిక్కెట్ రేట్ సగటు ప్రేక్షకుడికి అందుబాటులో ఉండే విధంగా సినిమాలను చేస్తే బాగుంటుందంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…
స్టార్ హీరోల సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడాలి అంటే తమ అభిమానులు గాని, ప్రేక్షకులు గాని ఒక నెల సాలరీని ఆ సినిమా మీద కేటాయించాల్సిన అవసరమైతే వస్తుంది. ఇక ఇలాంటి పరిస్థితులు రావడం వల్ల ప్రేక్షకులు థియేటర్లోకి రాకుండా ఓటిటి లో సినిమాలను చూసుకుంటూ పైరసీని ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది… ఇప్పటికైనా మన స్టార్ హీరోలు ఈ సమస్యకు చెక్ పెట్టాల్సిన అవసరమైతే ఉంది…