Yellamma Villain: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ముందుకు దూసుకెళ్తున్న నటులు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది దర్శకులు సైతం వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరైతే చేసిన ఒకటి రెండు సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించి వాళ్లకు తిరుగులేదు అనేలా వాళ్ళను వాళ్ళు ఎలివేట్ చేసుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ‘బలగం’ సినిమాతో గొప్ప గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు వేణు…ప్రస్తుతం ఆయన ఎల్లమ్మ ప్రాజెక్ట్ ను ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.
రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ మూవీలో దేవి శ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్నాడు. ఇంతకు ముందు ఈ సినిమా అతనికి సెట్ అవుతుందా? లేదా అనే అనుమానాలు వ్యక్తమైనప్పటికి రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ ను చూస్తే ఈ సినిమా దేవికి చాలా బాగా సెట్ అయింది.
అలాగే ఈ కథకి దేవి కూడా చాలా బాగా సెట్ అయ్యాడు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో విలన్ ఎవరు అనే దానిమీద సర్వత్రా ఆసకైతే నెలకొంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక స్టార్ హీరో ను విలన్ గా నటింపిజేయడానికి మేకర్స్ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఒకప్పటి స్టార్ హీరో అయిన వడ్డే నవీన్ ను ఈ సినిమాలో విలన్ గా తీసుకున్నారనే వార్తలైతే వస్తున్నాయి. మరి దీని మీద అఫీషియల్ గా ఇంకా సినిమా యూనిట్ నుంచి అనౌన్స్ మెంట్ అయితే రాలేదు. కానీ ఏది ఏమైనా కూడా ఈ సినిమాకి తను పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడనే ఉద్దేశ్యంతోనే వేణు అతన్ని తీసుకున్నట్లుగా తెలుస్తుంది… ఇక ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…