Shriya Saran: అందాల ముదురు భామ శ్రియ అసలు తగ్గట్లేదు. పబ్లిక్ గా బరితెగిస్తూ తన భర్త ఆండ్రీ కొశ్చివ్ కి ఘాటు ముద్దులు ఇస్తూ ముందుకు పోతుంది. ప్రస్తుతం తన భర్త ఆండ్రీతో తెగ విహార యాత్రలు చేస్తోంది. ప్రస్తుతం న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం గోవా వెకేషన్ ప్లాన్ చేసుకుంది. చేసుకుంటే చేసుకుంది, పబ్లిక్ గా కిస్సింగ్ గేమ్ అంటూ నానా రచ్చ చేసింది.

స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తడి బట్టలతోనే భర్తకి ఘాటు కిస్ ఇచ్చి, నెటిజన్లను కవ్విస్తూ ఓ అదిరిపోయే ఫోజు పెట్టింది. అంతటితో ఆగితే హీరోయిన్ ఎందుకు అవుతుంది, అందుకే తన ఘాటు చుంబన దృశ్యాల ఫోటోలని సగర్వంగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి.. చూసుకున్నోళ్లకు చూసుకున్నంత అన్నట్టు ఆ ఫోటోలను చాలా క్లారిటీగా పోస్ట్ చేసింది.
Also Read: నాలుగేళ్లు కష్టపడితే టాలెంటెడ్ డైరెక్టర్ కి బ్యాడ్ ఫీడ్ బ్యాక్
అన్నట్టు శ్రియ ఈ ఏడాది ఒక పాపకు జన్మనిచ్చింది. తన కూతురుకి రాధ అనే పేరు కూడా పెట్టింది. కానీ, మధ్యమధ్యలోనే ఇలా తన భర్తతో గాఢమైన సరసాలు ఆడుతూ వాటికి సంబంధించిన వీడియోలను, ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉండటమే బాగాలేదు. అయినా పబ్లిక్ గా ముద్దూముచ్చట ఆడడం ఏమిటో ? అసలు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఏమిటో ? శ్రియకే తెలియాలి.
అయితే, శ్రియ మాత్రం ఎప్పటికప్పుడు తన టూర్ వీడియోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. తన ఫాలోవర్స్ కి తన రొమాంటిక్ క్షణాలను కళ్ళకు కట్టినట్లు చూపించాలనే కోరిక తనకు ఉందని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అందుకే తాజాగా ఆ ఘాటు ముద్దు తాలూకు ఫోటో కూడా పోస్ట్ చేసి ఉంటుంది. అయినా శ్రియ కొత్తగా చూపించేది ఏముంది ? ఇంతకంటే సినిమాల్లో ఎక్కువ ఎక్స్ పోజింగ్ చేసింది కదా.
Also Read: రివ్యూ : “అర్జున ఫల్గుణ” !