https://oktelugu.com/

RRR: కాపీ వ్యవహారం పై రాజమౌళి మనసులో మాట !

RRR: తెలుగు వెండితెర పై ఇప్పటివరకు అపజయం ఎరగని ఏకైక దర్శకుడు రాజమౌళి. అందుకే రాజమౌళి అనగానే బ్లాక్ బస్టర్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. అయితే, రాజమౌళి పై ఎప్పటి నుంచో ఓ బలమైన అపవాదు ఉంది. ఆయన ఎక్కువగా వేరే సినిమాల నుంచి కాపీ కొడతారు అని ఆ అపవాదు సారాంశం. అందుకు తగ్గట్టుగానే రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా హాలీవుడ్ సినిమాలలోని కొన్ని సీన్లు కనిపిస్తుంటాయి. మెయిన్ గా పలు హాలీవుడ్ సినిమాల్లోని అద్భుతమైన యాక్షన్ […]

Written By:
  • Shiva
  • , Updated On : December 31, 2021 / 03:18 PM IST

    SS Rajamouli

    Follow us on

    RRR: తెలుగు వెండితెర పై ఇప్పటివరకు అపజయం ఎరగని ఏకైక దర్శకుడు రాజమౌళి. అందుకే రాజమౌళి అనగానే బ్లాక్ బస్టర్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. అయితే, రాజమౌళి పై ఎప్పటి నుంచో ఓ బలమైన అపవాదు ఉంది. ఆయన ఎక్కువగా వేరే సినిమాల నుంచి కాపీ కొడతారు అని ఆ అపవాదు సారాంశం. అందుకు తగ్గట్టుగానే రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా హాలీవుడ్ సినిమాలలోని కొన్ని సీన్లు కనిపిస్తుంటాయి.

    RRR

    మెయిన్ గా పలు హాలీవుడ్ సినిమాల్లోని అద్భుతమైన యాక్షన్ సీన్లను మరియు కళ్ళు చెదిరే వైవిధ్యమైన షాట్స్ ను రాజమౌళి కాపీ కొట్టినట్లు నెట్టింట అనేక ఋజువులు కూడా ఉన్నాయి. అందుకే జక్కన్న కాపీ కొట్టి సినిమాలు తీస్తారని విమర్శలు నేటికీ వస్తూనే ఉన్నాయి. ‘మగధీర’, ‘బాహుబలి’ వంటి చరిత్ర తిరగరాసిన సినిమాల్లో కూడా కొన్ని షాట్స్ కాపీ ఉన్నాయని వార్తలు వచ్చాయి.

    Also Read:  రివ్యూ  : “అర్జున ఫల్గుణ”  !

    అయితే, తాజాగా ఈ కాపీ వ్యవహారం పై రాజమౌళి మాట్లాడారు. రాజమౌళి మాటల్లోనే.. “నా పై చిన్నతనం నుంచే రామాయణం, మహాభారతం ప్రభావం ఎక్కువ. ఇక నా సినిమాల్లోని సన్నివేశాలకు, అలాగే నా సినిమాల్లోని పాత్రలకి ప్రధాన స్ఫూర్తి అంటే.. నేను ఆ రెండు మహా కావ్యాలే అని చెబుతాను. చిన్నప్పటి నుంచి చందమామ కథలు, రామాయణ, మహాభారత గాథలు విని, చదివి నేను పెరిగాను.

    అలాగే నేను కామిక్స్ కూడా ఎక్కువ చదివాను. కాబట్టి వాటి ప్రభావం నాపై ఎక్కువ ఉంది. ఐతే, నా పై వచ్చే విమర్శల్లో వాస్తవం లేదు. నేను నా సన్నివేశాలను, అలాగే కథనాన్ని మొత్తం నా ఊహాశక్తికి తగ్గట్లుగా రాసుకుని సినిమాలు చేస్తాను. అంతేగానీ, నేను ఏ సినిమాలను అనుకరించను’ అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు.

    ఇక వచ్చే వారం రానున్న “ఆర్ఆర్ఆర్” సినిమాలో కూడా ఎమోషన్స్ అద్భుతంగా ఉంటాయని రాజమౌళి చెప్పాడు.

    Also Read:  ‘పుష్ప’లో ఈ సీన్ పడి ఉంటేనా..?

    Tags