https://oktelugu.com/

Ram Charan: ఆ “100 కోట్లు” ఎక్కడున్నాయో చెప్పండంటూ మీడియాకి షాకిచ్చిన రామ్ చరణ్?

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వరుస సినిమాలు చేస్తూ ప్రజెంట్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాస్‌ బిజీ షెడ్యూల్‌కు ఇటీవల కాస్త బ్రేక్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం చెర్రీ ఆర్‌ఆర్‌ఆర్‌, ఆచార్య సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. వీటితో పాటు శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే శంకర్‌ చిత్రం కోసం రామ్‌ చరణ్‌ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 31, 2021 / 03:29 PM IST
    Follow us on

    Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వరుస సినిమాలు చేస్తూ ప్రజెంట్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాస్‌ బిజీ షెడ్యూల్‌కు ఇటీవల కాస్త బ్రేక్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం చెర్రీ ఆర్‌ఆర్‌ఆర్‌, ఆచార్య సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. వీటితో పాటు శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే శంకర్‌ చిత్రం కోసం రామ్‌ చరణ్‌ తన తర్వాత సినిమాల కోసం ఏకంగా రూ. 100 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకోనున్నాడని వార్తలు సోషల్ మీడియా లో తెగ సందడి చేస్తున్నాయి. వీటితో పాటే యూవీ క్రియేషన్స్‌ బ్యానర్ లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో కూడా నటిస్తున్నాడు.

    Ram Charan

    ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రమోషన్స్‌లో ఉన్న చరణ్ రెమ్యునరేషన్‌పై వస్తున్న వార్తలపై స్పందించాడు. ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని, అవన్నీ అసత్య ప్రచారాలని కొట్టిపారేశారు. అసలు వంద కోట్లు ఎక్కడున్నాయి, ఉన్నా నాకెవరు ఇస్తారు’ అంటూ సింపుల్‌గా అవన్నీ ఫేక్‌ వార్తలే అని తేల్చేశారు. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోన్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ మరియు మలయాళ భాషల్లో సినిమాను ప్రమోట్ చేస్తూ ముగ్గురూ దేశమంతటా పర్యటిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ‘జంజీర్‌’తో బాలీవుడ్ లో ప్రయత్నం చేసి విఫలమైన తర్వాత రామ్ చరణ్ చేస్తున్న మరో బాలీవుడ్ చిత్రమిది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.\

    Also Read: అదిరిపోయిన “పుష్ప” సినిమా డెలీటెడ్ సీన్… అల్లు అర్జున్ ఏం చేశాడంటే ?