salman khan pooja hegde relationship : ఆ సీనియర్ హీరోకు ఎప్పుడూ అదే పని అట.. అందుకే 50 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా కొత్తగా వచ్చే హీరోయిన్లను అవకాశాల పేరుతో గోకడమే పనిగా పెట్టుకుంటాడని.. ఆయన చేతిలో పడ్డ హీరోయిన్లు కథలు కథలుగా చెబుతారు. ఇటీవలే ఒక హీరోయిన్ అయితే తనను సిగరెట్లతో కాల్చి లైంగికంగా వేధించాడని కూడా ఆడిపోసుకుంది. ఆయన ఎవరో కాదు మన కండల వీరుడు సల్మాన్ ఖాన్.

బాలీవుడ్‌లో ప్రతి క్షణం గాసిప్‌లు దావానలంలా వ్యాపిస్తుంటాయి. ఇక్కడ హీరో, హీరోయిన్ల మధ్య అనుబంధం సర్వసాధారణం. తాజాగా బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరో ప్రేమ గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.
తాజాగా సల్మాన్ ఖాన్ హీరోగా ‘కిసికా భాయ్.. కిసికా జాన్’ అనే చిత్రం రూపొందుతోంది. దీన్నే సల్మాన్ ఖాన్ యే నిర్మాతగా మారి తీస్తున్నారు. ఇందులో పూజాహెగ్డేను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక మన విక్టరీ వెంకటేశ్, జగపతిబాబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. తమిళ ‘వీరం’ మూవీ రిమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.
తాజాగా బాలీవుడ్ లో సర్క్యూలేట్ అవుతున్న రూమర్ ఏంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న పూజా హెగ్డే.. సల్మాన్‌ఖాన్‌కి బాగా నచ్చిందని, అందుకే ఆమెతో సినిమాలకు సైన్ చేశాడని ప్రచారం జరుగుతోంది. కలిసి కాలక్షేపం చేస్తున్నారనే రూమర్లు కూడా మొదలయ్యాయి.
సల్మాన్ ఇంతకుముందు పలువురు హీరోయిన్లతో అచ్చం ఇలాగే రిలేషన్ షిప్ పెట్టుకొని పెళ్లి వరకూ వచ్చేసరికి బ్రేకప్ చేసుకున్నాడు. ఇప్పుడు పూజాను కూడా అలాగే గోకి ప్రేమలో దింపాడని రూమర్ నడుస్తోంది.
ఈ రొటీన్ పుకారు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈమె సల్మాన్ కు ఎన్నో గర్ల్ ఫ్రెండ్ అంటూ లెక్కలు వేస్తున్నారు. ఈ పరిణామం గురించి సల్మాన్ ఖాన్‌కు కూడా తెలియకపోవచ్చు అంటున్నారు.
పూజా హెగ్డే ప్రస్తుతం సల్మాన్‌తో కిసీ కా భీ కిసీ కీ జాన్ మరియు మహేష్ బాబుతో తెలుగు సినిమాలో నటిస్తోంది.. ఇక సల్మాన్ ఖాన్.. వేద్, పఠాన్, టైగర్ 3 చిత్రాల్లో నటిస్తున్నాడు. మరి వీరి బంధం ఎక్కడి వరకూవెళ్లిందన్నది తెలియాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే.